ఇప్పటి వరకు హోరాహోరీగా జరిగిన మునుగోడు ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది.నేడు ఓటరు తను తీర్పును ప్రకటించబోతున్నారు.
ఈరోజు జరగబోతున్న పోలింగ్ లో ఓటరు దేవుడు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారనే టెన్షన్ అన్ని పార్టీలలోను ఉంది.ఈ ఉపఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మక కావడంతో అన్ని ప్రధాన పార్టీలు గెలుపు కోసం భారీగానే సొమ్ములు ఖర్చు పెట్టాయి.
ఎన్నికల కమిషన్ పోలీసులు ఎంత పగడ్బందీగా నిఘా ఏర్పాటు చేసినా.వారి కళ్ళు గప్పి మరి ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేయడంలో అన్ని పార్టీలు సక్సెస్ అయ్యాయి.
ఈ ఉప ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా కనిపించనుంది. అన్ని ప్రధాని పార్టీలు సొమ్ములు , చీరలు పంపిణీ చేపట్టి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించాయి.
ఇక రాజకీయ పార్టీలు పంచిపెట్టే సొమ్ములు, తాయిలాల కోసం ఓటర్లు తమ ఇళ్ళ వద్దు పడిగాపులు పడ్డారు.కొంతమందికి సొమ్ములు అందుకు పోవడంతో నేరుగా నాయకులను నిలదీసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
పోలీసు, ఎన్నికల కమిషన్ నిఘా ను తప్పించుకొని మరి ఓటర్లకు సొమ్ములు, చీరలు, ఇతర తాయిలాలు పంపిణీ చేయడంలో అన్ని ప్రధాన పార్టీలు సక్సెస్ అయ్యాయి.మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 90 శాతం ఓటర్లకు ఓటుకు 3000 చొప్పున నిన్న పంపిణీ చేసినా.
ఓ ప్రధాన పార్టీ దానికి అదనంగా మరో రెండు వేలను పంపిణీ చేసింది.ఇక మరో ప్రధానపార్టీ ఓటుకు నాలుగు వేల చొప్పున , అదనంగా మహిళలకు చీరలు పంపిణీ చేసినట్లు సమాచారం. కొన్నిచోట్ల ఓటర్లకు పంపిణీ చేసిన సొమ్ముల కవర్ లో నగదు తక్కువగా ఉండడం పై ఓటర్లు ఆగ్రహం చెంది సదరు పార్టీ నాయకులను నిలదీసిన పరిస్థితి కనిపించింది.పోలీసులు ఎంత పగడ్బందీగా నిఘా ఏర్పాటు చేసినా, సరికొత్త విధంగా నగదు పంపిణీ చేపట్టేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నించి సక్సెస్ అయ్యాయి.
ఇక పోలింగ్ కు 48 గంటలకు ముందే స్థానికేతరులు నియోజకవర్గాన్ని విడిచి వెళ్లాలని ఆదేశాలు ఉన్నా.అది ఎవరు పాటించలేదు.
హైదరాబాద్ కు చెందిన ది మంది వివిధ పార్టీల నాయకులు ఇంకా మునుగోడు లోనే మకాం వేశారు.ఈ విధంగా ఓటర్లను పార్టీలన్నీ నోట్లు, చీరల పంపిణీ తో ఆకట్టుకునేందుకు ప్రయత్నించాయి.
నేడు ఓటరు తన తీర్పును ఓటు రూపంలో ఇవ్వబోతున్నారు.

కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి , బిజెపి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టిఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తుండగా, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తో పాటు అనేకమంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.వారికి కేటాయించిన ఎన్నికల గుర్తులు ప్రధాన పార్టీల ఎన్నికల గుర్తులను పోలి ఉండడంతో తమ పార్టీకి పడాల్సిన ఓట్లు స్వతంత్ర అభ్యర్థులకు వెళ్ళిపోతాయేమో అనే టెన్షన్ ప్రధాన పార్టీలలో నెలకొంది.ముఖ్యంగా టిఆర్ఎస్ ఈ విషయంలో మరింత కలవరం చెందుతోంది.







