ప్రారంభంలో రష్యా,చైనాలు మిత్రదేశాలుగా ఉండేవి.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇవి రెండు శాశ్వత సభ్య దేశాలు.
విశ్వంలో అమెరికా సూపర్ పవర్ గా ఉందని,అమెరికా ప్రాభవం చాలా వరకు తగ్గించాలని చైనా అప్పట్లో రష్యాతో జత కట్టింది.క్రమేణా ఆ బంధం బలపడింది.
ఆ మైత్రి బంధానికే అరవై ఐదు ఏళ్ళు నిండాయి.ఇదేమంతా పెద్ద విషయం కాదు.
కాని ప్రస్తుత పరిస్థితుల్లో చైనా రష్యాను దగ్గరకు తీసుకోవాలనే తలంపుతో ఉంది.రష్యా, భారత్ తో సన్నిహిత సంబంధాలు నెరపుతున్న దృష్ట్యా భారత్ కంటే మాతోనే రష్యాకు ఎక్కువ దృఢమైన సంబంధాలు ఉన్నాయని చైనా చెప్పడం చూస్తుంటే రష్యాకు దగ్గర కావాలని తెలుస్తోంది.
మన మైత్రికి 65 ఏళ్ళు పూర్తి అయ్యాయి అని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ,పుతిన్ కు శుభాకాంక్షలు చెప్పడం రెండు దేశాల మధ్య స్నేహ బంధం మరచిపోలేనిదని జిన్ పింగ్ వ్యాఖ్యానించడం, రష్యా ఆసియ ఖండంలో విస్తరించి ఉన్నందున చైనా కేవలం భారత్ ను రష్యాకు దూరం చేయాలనే జిన్ పింగ్ ఎత్తుగడ గా ఉంది.కాని భారత్,రష్యా ల మైత్రి బంధం ఎప్పటికి చెరిగి పోనిది.
విశ్వంలో ఏ దేశానికి ఇవ్వని విలువ భారత్ కు రష్యా ఇస్తోంది,రెండు దేశాల మధ్య మంచి సత్ సంబంధాలు ఉన్నాయి.
అలాగే రష్యా కూడా భారత్ మాకు మంచి మిత్రత్వం గల దేశమని ఎన్నో మార్లు చెప్పింది.
అదే చైనాకు నచ్చడం లేదు.పైగా భారత్, రష్యా స్నేహాన్ని కూడా జీర్ణించుకోలేక పోతోంది.
అందుకే కొత్తగా రష్యాతో మా మైత్రి పటిష్టం అని ఇటీవల పేర్కొంది.ఇంతవరకు స్తబ్దుగా ఉండి రష్యాతో మా మైత్రికి 65 సంవత్సరాలు నిండాయి అని జిన్ పింగ్ చెప్పడం ఆశ్చర్యం.
అసలు భద్రతా మండలిలో చోటు కోసం భారత్ ప్రయత్నాలు చేస్తున్న దశలో రష్యా అంగీకరించడం,అదే తరుణంలో చైనా వ్యతిరేకంగా ఓటు వేయడం తెలిసిందే.ఇంతవరకు భద్రతా మండలిలో భారత్ కు చోటు దక్కక పోవడం అనేది చైనా ఆడే నాటకమే.
రష్యా తో మైత్రి ఉన్నప్పుడు, రష్యాతో పాటు చైనా కూడా భారత్ కు అనుకూలంగా ప్రవర్తించాలి.అలాంటప్పుడు స్నేహం ఎలా సాధ్యమవుతుంది.
మాములుగా ద్వైపాక్షిక సంబంధాలు లో రెండు దేశాలు ఒక అవగాహనతో కుదుర్చు కుని ఉండవచ్చు.అంతే కాని చెప్పుకోదగ్గ సంబంధాలు రష్యా తో చైనా కు లేవు.
జిన్ పింగ్ ఇప్పుడు రష్యాతో మా స్నేహం 65 ఏళ్ళు నిండాయి అని చెప్పడం కొత్తగ అనిపిస్తోంది.అదే సమయంలో రష్యా ఏ మాత్రం చెప్పక పోవడం విడ్డురమే.
ముందు చైనా అధ్యక్షుడు శుభాకాంక్షలు చెప్పిన తరువాతనే పుతిన్ స్పందించి గౌరవంగా శుభాకాంక్షలు అందించ్చారు.

ప్రస్తుతం రష్యా ఊపిరి సలపనంత పనిలో ఉంది.ఉక్రెయిన్ తో యుద్ధం ముగింపు ఎంతకు అంతుబట్టడం లేదు.ఎనిమిది నెలల పైగా సాగుతున్న యుద్ధం ఇంతవరకు ముగింపు దశకు రాకపోవడం, ఏమి చేయాలోనని రష్యా దీర్ఘా లోచనతో ఉంది.
ఇటువంటి తరుణంలో హఠాత్తుగా చైనా రష్యాతో మా మైత్రి దృఢతరం అని కొత్త పల్లవి ఎత్తుకుంది.నవశకం కోసం నవీన పద్ధతులతో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటు వ్యూహాత్మక భాగస్వామ్యం తో మా బంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని చైనా వ్యాఖ్యానించింది.ఇది భారత్ నిశితంగా గమనిస్తోంది.65 ఏళ్ల మైత్రి అని చైనా చెప్పుకోవడం ఒకింత ఆశ్చర్యంగా ఉందని భారత్ అభిప్రాయ పడుతోంది.ఈ మైత్రి ఒక అవకాశ వాదం లాగా ఉందని కొన్ని దేశాలు వ్యాఖ్యానించడం గమనార్హం.విశ్వం లో రష్యా,మరియు ఉత్తర కొరియా తో ఏ దేశం కు సరైన సంబంధాలు లేవు.
ఏవో పాకిస్తాన్ వంటి దేశాలు చైనాతో స్నేహాన్ని కోరుకుంటున్నాయి.పాక్ కూడా భారత్ ను నిలువ రించాలనే వైఖరితోనే ఉంది.
అమెరికాను దెబ్బ తీయాలి అంటే రష్యా దగ్గరకు చేరువ కావాలని చైనా యోచన గా ఉంది.
ఫ్రాన్స్ , చైనా ను ఎట్టి పరిస్థితుల్లో నమ్మదు.
ఇక అమెరికా, బ్రిటన్ దేశాలు చాలా వరకూ చైనాతో అంటి ముట్టనట్లుగా ఉన్నాయి.ఇటువంటి పరిస్థితుల్లో చైనా కు రష్యా ఓ ఆశాకిరణం లా క నిపించడం ,అప్పుడెప్పుడో చేసుకున్న సంబంధాల దృష్యా మా మైత్రికి అరవై ఐదు ఏళ్ళు నిండాయి అని చెప్పు కోవడం చూస్తే చైనాకు రష్యాతో మైత్రికి తహ తహ లాడుతున్నట్లు అగుపిస్తోంది.
అది పాత సంబంధాలనే తెర పైకి తెచ్చింది.ప్రస్తుతం రష్యా తో చైనా సంబంధాలు అంత దృఢమైనవి కావు.
ఈ దిశలో చైనా ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది.వాస్తవానికి భారత్ తోనే రష్యా మైత్రి దృఢతరం,పటిష్టం.







