అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది.విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు.
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.ఈ ఘటన బొమ్మనహాల్ మండలం దర్గాహొన్నూర్ లో చోటు చేసుకుంది.
వెంటనే గమనించిన స్థానికులు బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు.పంట కోస్తుండగా విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగి కూలీలపై పడినట్లు తెలుస్తోంది.