సినీ ఇండస్ట్రీలో దర్శకనిర్మాతలు సినిమాను రూపొందించడం ఒక ఎత్తు అయితే ఆ సినిమాకు తగిన విధంగా ప్రమోషన్స్ చేయడం మరొక ఎత్తు అని చెప్పవచ్చు.భారీ బడ్జెట్ తో ప్రకటించిన సినిమాలకు అదే రేంజ్ లో ప్రమోషన్స్ ను ఏర్పాటు చేస్తూ ఉంటారు.
ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో ప్రమోషన్ల కోసం రకరకాల దారులను ఎంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే అభిమానులతో నేరుగా కలిసి ముచ్చటించడం, సినిమాలకు సంబంధించి లేదంటే ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సోషల్ మీడియాలో ట్వీట్లు చేయడం లాంటివి చేస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కూడా కాస్త డిఫరెంట్ గా తన సినిమా ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టేసింది.జాన్వి కపూర్ నటించిన తాజా చిత్రం మిలి.
నవంబర్ 4వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.కాగా సినిమా విడుదల తేదీకి మరికొన్ని రోజులే సమయం ఉండడంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు.
తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం ఢిల్లీలోని ఒక మల్టీప్లెక్స్ లో పాప్ కార్న్ ను సేల్ చేసింది జాన్వి.జాన్వి కపూర్ పాప్ కార్న్ అమ్మడం చూసి నెటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఆ తర్వాత ఆమె తదుపరి సినిమా కోసం ప్రమోషన్స్ లో భాగంగా ఈ విధంగా చేస్తుంది అని అర్థం చేసుకున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ వీడియో పై పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. సిటీ కోసం మీరు ఏదైనా చేస్తారు అని కొందరు కామెంట్ చేయగా,సినిమా ప్రమోషన్స్ కోసం అవసరమైతే వాష్ రూమ్స్ కూడా క్లీన్ చేస్తారు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇంకొందరు అయితే ఒకవేళ మీరు బోనీకపూర్ కూతురు కాకపోతే ఈ విధంగా నిజంగానే పాప్ కార్న్ అమ్మేవారు అంటూ ఆమెపై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.ఇంకొందరు మాత్రం ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.







