హైదరాబాద్ చర్లపల్లి జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథంపై బదిలీ వేటు పడింది.దశరథం వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఓ ఖైదీ సోదరి ఫిర్యాదు చేసింది.
న్యూడ్ వీడియో కాల్ చేస్తేనే పెరోల్ కు సహకరిస్తానంటూ వేధిస్తున్నారని ఫిర్యాదులో బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.బాధిత మహిళ ఫిర్యాదు మేరకు స్పందించిన జైళ్ల శాఖ దశరథాన్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలోనూ ఆన్ లైన్ లో న్యూడ్ కాల్స్ చేసి దశరథం లక్షల రూపాయలు పొగొట్టుకున్నట్లు సమాచారం.ఈ క్రమంలో ఆయనపై మూడు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.







