పవన్ కళ్యాణ్ .ఈ పేరు చెప్తే రెండు తెలుగు రాష్ట్రాలలో యువతకు ఎదో తెలియని వైబ్రేషన్.
ఆయనకు ఫ్యాన్స్ ఉండరు కేవలం భక్తులు మాత్రమే ఉంటారు.పవన్ కళ్యాణ్ ని పేరు చెప్పిన ఆయన ఫోటో కనిపించిన ఒక్క నిముషం అయినా ఆగి చూడని తెలుగు ప్రేక్షకుడు, సినిమా అభిమాని ఉండడు.
మరి ఇంతలా ఆయనలో ఏం క్రేజ్ ఉంది అంటే ఎవరు సమాధానం చెప్పలేరు.పవన్ అంటే ఒక పవర్.
కొంత మంది స్టార్ హీరోల లాగ డబ్బులు ఇచ్చే పెయిడ్ ఫ్యాన్స్ లేదంటే పేటీమ్ ఫ్యాన్స్ కాదు అసలు సిసలైన పవర్ స్టార్ భక్తులు.ఆయనకు స్టూడెంట్స్ లో ఎంత క్రేజ్ ఉందో, యువత లో ఎంత క్రేజ్ ఉందో అదే స్థాయిలో అమ్మాయిల్లో కూడా క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు.
మరి ఏడాది కి ఒక సినిమా తీసే ఎంతో మంది హీరోలు ఉన్న కేవలం పవన్ కళ్యాణ్ అంటే మాత్రమే ఈ అభిమానం ఉండటం విశేషం.పవన్ కళ్యాణ్ తీసిన మొదటి సినిమా ఫ్లాప్ అయి ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు హిట్ అయినా కూడా అంత క్రేజ్ రాలేదు.
తొలిప్రేమ, తమ్ముడు సినిమాల తర్వాత ఆయనకు ఆటిట్యూడ్ కి జనాలు ఫిదా అయ్యారు.చిరంజీవి తమ్ముడు అనే ముద్ర నుంచి బయటకు వచ్చి జనాలకు పవన్ కళ్యాణ్ అనే మత్తు ఎక్కించాడు.

బద్రి, ఖుషి సినిమాల తర్వాత ఆ క్రేజ్ ఆకాశాన్ని అంటింది.ఖుషి సినిమా తర్వాత గ్రహణం పట్టిన సూర్యుడిలా ఏకంగా పదేళ్ల పాటు అజ్ఞాత వాసం చేయాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ కి.ఏకంగా పదేళ్ల పాటు ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవి నిరాశపరుస్తూనే ఉన్నాయ్.ఇక గబ్బర్ సింగ్ సినిమా విజయం సాధించే వరకు పవన్ కళ్యాణ్ కి సరైన హిట్ లేదు.
అయినా కూడా ఆయనకు అభిమానులు ఏమాత్రం తగ్గకపోగా అంతకంతకు పెరుగుతూ వచ్చారు.

మధ్యలో జల్సా ఒకటి కూడా ఆయనకు ఊపిరి పోసింది.ఆ తర్వాత మళ్లి పరాజయాలు పలరించాయి.త్రివిక్రమ్ అత్తారింటికి దారేది సినిమా వచ్చే వరకు మళ్లి అదే పరిస్థితి.
ఆ తర్వాత వకీల్ సాబ్, భీమ్లా నాయక్ హిట్స్ గా నిలిచి పవన్ లో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు అని నిరూపించుకున్నాడు.ఇక రాజకేయాలను బాలన్స్ చేస్తూనే పవన్ కళ్యాణ్ సినిమాలను సైతం బాలన్స్ చేయండం నిజం హా హ్యాట్సాఫ్.







