రైల్వేగేట్ ఉద్యోగ విధుల గురించి తెలిసే ఉంటుంది.రైల్వే క్రాసింగ్‌ల వద్ద రైలు రాగానే గేటును ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం ఇక్కడ చేస్తుంటారు.
సింపుల్ గా చెప్పాలంటే అదొక్కటే పని.కానీ అది చూడటానికి తేలికైన పనిలాగా కనిపించినప్పటికీ ఎంతో బాధ్యతతో కూడుకున్న పని.సహజంగా ఈ విధులను పురుషులు మాత్రమే నిర్వహిస్తారు.కానీ అలాంటి విధులలో తాజాగా రైల్వే మహిళలను కూడా నియమించుకుంటుంది.
బేసిగ్గా ఇలాంటి ఉద్యోగాన్ని చేయడానికి మహిళలు ఎవరూ ముందుకు రారు.కానీ లక్నోలో ఓ మహిళ పదేళ్లుగా గేట్‌ఉమెన్‌గా పని చేస్తోందని మీకు తెలుసా?
లక్నోకి చెందిన సల్మా బేగ్ 2013లో 19 ఏళ్ల వయసులో గేట్ ఉమెన్‌గా బాధ్యతల్లో చేరి, నాటినుండి నేటివరకు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తోంది.ఈ క్రమంలో ఆమే దేశంలోనే మొట్ట మొదటి గేట్ ఉమెన్‌గా గుర్తింపు పొందింది.హిజాబ్ ధరించి విధులు నిర్వర్తించే ఆమెతో ఇపుడు జనాలు సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
మల్హౌర్ వద్ద రైల్వే క్రాసింగ్ వద్ద ఎక్కువగా ట్రాఫిక్ జాం అవుతుంది.తరచూ రైళ్లు ఈ ట్రాక్‌పై క్రాసింగ్ చేస్తూనే ఉంటాయి.సరిగ్గా అక్కడే గేట్ ఉమెన్ సల్మా గేట్‌ను క్లోజ్ చేయడానికి లివర్‌తో భారీ చక్రాన్ని తిప్పుతుంది.రైలు వెళ్లిపోగానే తిరిగి గేట్‌ను ఓపెన్ చేస్తుంది.

కాగా నేడు అనుకోని పరిస్థితుల్లో కొలువులో చేరిన ఆమె అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు.ఈ ఉద్యోగం పురుషులు, మహిళలకు అందుబాటులో ఉన్నప్పటికీ చాలా తక్కువ మంది మహిళలు దీనికోసం దరఖాస్తు చేసుకునేవారని, అందుకే సల్మా కంటే ముందు ఈ ఉద్యోగ అవకాశం ఎవరికీ లభించలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు.సల్మా తండ్రి మీర్జా సలీం బేగ్ కూడా ఇక్కడ గేట్‌మెన్‌గా పని చేసి, వినికిడి సామర్థ్యాన్ని కోల్పోయారు.దాంతో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.అలాగే సల్మా తల్లి పక్షవాతానికి గురవ్వడంతో గడ్డు పరిస్థితులలో సల్మా ఈ ఉద్యోగాన్ని ఎంచుకుంది.







