Union Ministe Kishan Reddy : కేసీఆర్‌ది కపట ప్రేమ.. ఇన్నేళ్లు ఏం చేశావ్.. కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్!!

మునుగోడు ప్రజలపై సీఎం కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసమే చండూర్ సభలో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నించాడని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 8 ఏండ్లు పూర్తి చేసుకుంది.అయినా ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేయని కేసీఆర్.ఇప్పుడు 15 రోజుల్లోనే హామీలు నెరవేరుస్తానని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.మునుగోడులో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే చండూరులో వంద పడకల ఆస్పత్రిని నిర్మిస్తామని చెప్పడం సిగ్గచేటని మండిపడ్డారు.

 Kcrs Hypocritical Love Kishan Reddys Hot Comments Cm Kcr, Union Minister, Kisha-TeluguStop.com

మునుగోడులో విలేఖరుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.

‘మునుగోడు అభివృద్ధి కుంటుపడింది.ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.

ప్రజలకు మెరుగైన సదుపాయాలు కూడా లేవు.టీఆర్ఎస్‌కు అర్థమైంది.

మునుగోడులో గెలవడం ఎంతో కష్టమైంది.అందుకే నెల రోజులుగా టీఆర్ఎస్ కౌరవ సేన ప్రచారంలో పాల్గొంటోంది.

వీరితో కూడా ఫలితం లేదంటూ.సీఎం కేసీఆరే రంగంలోకి దిగారు.

చండూరు సభలో కపట ప్రేమను చూపారు.ఇచ్చిన హామీలు నెరవేస్తానని, ఆస్పత్రిని నిర్మిస్తానని, చెర్లగూడెం రిజర్వాయర్‌ను త్వరలో పూర్తి చేస్తానని చెప్పారు.మునుగోడు ప్రజలపై అంత ప్రేమే ఉంటే ఇన్నేళ్లలో ఈ అభివృద్ధి ఎందుకు చేయలేదు? 2014 ఎన్నికలప్పుడు మునుగోడు నియోజకవర్గంలోని 1.72 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని చెప్పారు.కానీ ఇప్పటికీ ఒక్క ఎకరాకు కూడా నీటిని ఇవ్వలేదు.దీనిపై సమాధానం ఇచ్చే దమ్ముందా? టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ కాళ్ల వద్ద ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారు.’ అని మండిపడ్డారు.

Telugu Chandur Sabha, Cm Kcr, Hot, Kishan Reddy, Munugodu-Political

‘సీఎం కేసీఆర్.చేనేత కార్మికులపై సవతి ప్రేమ చూపిస్తున్నారు.రూ.40 లక్షల వ్యాపారం దాటిన చేనేత కార్మికులకు మాత్రమే కేంద్రం 5 శాతం జీఎస్టీ విధించేలా కేసీఆర్ ప్రభుత్వమే ఒప్పుకుంది.కానీ ఇప్పుడు దాన్నే ఎందుకు వ్యతిరేకిస్తోంది?.సీఎం కేసీఆర్‌కు చేనేత కార్మికులపై అంత ప్రేమ ఉంటే.జీఎస్టీలో రాష్ట్రానికి వచ్చే 2.5 శాతం వాటా ఎందుకు చేనేత కార్మికులకు తిరిగి ఇవ్వడం లేదు.టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు.

వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు.వారిలో టీఆర్ఎస్‌లోకి రప్పించుకునేందుకు ఎంత ఖర్చు చేశారో చెప్పండి.

తమ అక్రమాలకు కప్పిపుచ్చేందుకు 51జీఓను తీసుకొచ్చారు.సీబీఐ విచారణ జరపనివ్వకుండా అడ్డుపడుతున్నారు.

ఎలాంటి తప్పు చేయనప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారనో చెప్పాలి.’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube