టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన చిత్రం హిట్.ఈ సినిమాలో విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన విషయం తెలిసిందే.
కాగా శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, స్టార్ హీరో నాని నిర్మాత వ్యవహరించారు.హిట్ : ది ఫస్ట్ కేసు సినిమాతో మంచి హిట్ ను సాధించారు డైరెక్టర్ శైలేష్.అయితే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా కు సీక్వెల్ ఉందని ఆనాడే ప్రకటించగా ఆ తరువాత హిట్: ది సెకెండ్ కేసు సినిమాను ప్రారంభించారు.కానీ ఈ సీక్వెల్‌లో విశ్వక్ సేన్ కు బదులుగా అడివి శేష్ హీరో అనగానే అందరూ ఆశ్చర్యపోయారు.
పార్ట్ వన్ లో విశ్వక్ సేన్ ని పెట్టి పార్ట్ 2 లో అడవి శేష్ నటించడం ఏంటి అని ప్రశ్నించారు.తాజాగా ఈ ప్రశ్నపై డైరెక్టర్ శైలేష్ స్పందిస్తూ సమాధానం ఇచ్చారు.
హిట్ 2 సినిమా టీజర్ డేట్ ని ప్రకటిస్తూ తాజాగా ఒక వీడియోని విడుదల చేశారు.కాగా ఆ వీడియోకి హిట్ వెర్స్ అని పేరు కూడా పెట్టారు.
కాగా హిట్: ది సెకెండ్ కేస్ అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారని, అదేంటి ఫస్ట్ పార్ట్‌లో విశ్వక్‌సేన్ కదా చేసింది, సెకండ్ పార్ట్‌లో శేష్ రావడమేంటని తనను తిట్టుకున్నారని శైలేష్ తెలిపారు.అయితే సినిమాలో విక్రమ్ రుద్రరాజు (విశ్వక్ సేన్) ఎక్కడికి వెళ్లడని ఈ యూనివర్స్ లోనే ఉంటాడని, మళ్లీ వస్తాడని శైలేష్ తెలిపారు.

అందరూ పోలీస్ ఆఫీసర్ లు కలిసి ఒక పెద్ద కేస్ సాల్వ్ చేసినప్పుడు విక్రమ్ రుద్రరాజు స్టోరీ కూడా కంప్లీట్ అవుతుందని వెల్లడించారు.ఇక సెకెండ్ కేస్‌లో ప్రేక్షకులు చూడబోయే ఆఫీసర్ పేరు కృష్ణ దేవ్ అలియాస్ అడివి శేష్ అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ శైలేష్ హిట్ 2 తరవాత హిట్: ది థర్డ్ కేస్ కూడా ఉంటుందని శైలేష్ హింట్ ఇచ్చారు.కాగా హిట్ 2 టీజర్‌ను నవంబర్ 3న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.అలాగే హిట్ 2 సినిమా డిసెంబర్ 2 న విడుదల కానుందీ.







