ప్రపంచంలో ఎన్నో రకాల వేషధారణలతో ప్రజలు చాలా రకాల పండుగలను, చిన్న చిన్న వేడుకలను జరుపుకుంటూ ఉంటారు.అలాంటి వేడుకలలో కొంతమంది ప్రజలు వారి వేషధారణతో ప్రజలను ఆకర్షిస్తూ మరికొంతమంది ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వేడుకలను ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు.
ముఖ్యంగా హాలోవీన్ వేడుకలను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు.
ముఖ్యంగా వేడుకల్లో ప్రజల వేషధారణ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.దెయ్యాలు, భూతాల్లా, రక్త పిశాషల్లా రెడీ అయ్యి అక్కడికి వచ్చిన ప్రజలను భయపెడుతుంటారు.
తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.హాలోవీన్ సంబరాలలో భాగంగా కాలిఫోర్నియా కు చెందిన కేట్ స్ట్రైకర్ అనే యువతి అలంకరణ ను చూసిన నెటిజన్లను షాక్ కు గురవుతున్నారు.
హాలోవీన్ వేడుక కోసం ఆమె తయారైన విధానం భయాందోళనకు గురి చేస్తోంది.నల్లటి దుస్తుల్లో ఆమె దంతాలు, కళ్లు, ముఖ మంతా రక్తపు మరకల తో రక్త దెయ్యం లాగా కనిపిస్తూ ఉంది.
ఇలా తయారవ్వడానికి ఆమె ఎక్కువగా టిష్యూ, కాటన్‌నే ఉపయోగించడం వైరల్ అవుతున్న వీడియోలో చూడవచ్చు.ఈ వీడియో ను స్ట్రైకర్ తన ట్విట్టర్ ఖాతా లో షేర్ చేసింది.
ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు.వీడియో చూసిన వారందరూ రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు.
మరి ఇంత భయంకరంగా తయారవుల అని కామెంట్లు చేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే ఈ హాలోవీన్ వేడుకలు ఏటా అక్టోబర్ 31న చిన్నారులు, యువత విచిత్రమైన దుస్తులు ధరించి అక్కడికి వచ్చే ప్రజలను భయపిస్తూ ఉంటారు.
దెయ్యాలు, రాక్షసుల లాగా వేషాలు వేసుకొని రాత్రి పూట విందు వినోదాలు చేస్తూ ఉంటారు.







