ఏపీలో కల్లు గీత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.కల్లుగీత కార్మికులకు వైఎస్ఆర్ బీమా వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు 2022-27 ఏడాదికి కల్లు గీత పాలసీని సర్కార్ ప్రకటించింది.మృతి చెందిన కల్లు గీత కార్మికుని కుటుంబానికి ఇచ్చే ఎక్స్ గ్రేషియో పెంచుతున్నట్లు తెలిపింది.ఎక్స్ గ్రేషియోను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ పాలసీని ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది.నరేగా సహా ఇతర సంక్షేమ పథకాల ద్వారా గీత కార్మికులను ఆదుకుంటామని ప్రభుత్వం తెలిపింది.
కల్లు గీత కార్మికుల నుంచి వసూలు చేసే తాడి చెట్టు అద్దెను రద్దు చేసింది.







