కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.దీనిలో భాగంగా రేపు హైదరాబాద్ లో రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది.
ఈ క్రమంలో రేపటి పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, అందుకు అధిక సంఖ్యలో హైదరాబాద్ కు తరలి రావాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి బహిరంగ లేఖ రాశారు.
రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.దేశం కోసం రాహుల్ గాంధీతో కలిసి కదం తొక్కుతారని విశ్వసిస్తున్నట్లు వెల్లడించారు.
దేశ ఐక్యతే ప్రాధాన్యత అని చాటుదామన్న ఆయన దేశం కోసం ఒక్క రోజు, ఒక్క గంట గడప దాటి రావాలని కోరారు.ఈ క్రమంలో అందరూ రేపు మధ్యాహ్నం 3 గంటలకు చార్మినార్ వద్ద కలుద్దామని లేఖలో స్పష్టం చేశారు.







