కమెడియన్ ప్రియదర్శి గత కొన్నేళ్లుగా బాగా పాపులర్ అవుతున్న నటుడు.తొలి సినిమా శ్రీకాంత్ హీరోగా వచ్చిన టెర్రర్.
ఈ సినిమాలో అతడు టెర్రరిస్ట్ పాత్రలో నటించగా, ఈ సినిమా 2016 లో విడుదల అయ్యింది.ఇదే సంవత్సరం పెళ్లి చూపులు సినిమా తో విజయ్ దేవరకొండ స్నేహితుడి పాత్రలో నటించగా అది ప్రియదర్శి కి మంచి పేరు తీసుకచ్చింది.
ఈ సినిమాలో అతడు చెప్పిన డైలాగ్స్ అన్ని కూడా బాగా యూత్ కి కనెక్ట్ అయ్యాయి.ఇక ప్రియదర్శి తండ్రి పులికొండ సుబ్బారావు ఒక గొప్ప కవి.అలాగే గౌరవ డాక్టరేట్ కూడా పొందాడు.ఇక పిడుగురాళ్లలో పుట్టిన ప్రియదర్శి హైదరాబాద్ లో పెరిగాడు.
చిన్నతనం నుంచి నటుడు కావాలనుకున్న పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరాలన్న అతడి తండ్రి ఒప్పుకోలేదు.
దాంతో తన తండ్రి పని చేస్తున్న కాలేజీలో మాస్ కమ్యూనికేషన్స్ లో చేరి షార్ట్ ఫిలిమ్స్ నిర్మాణంలో మెళకువలు నేర్చుకున్నాడు.
ఇక ఆతర్వాత 9 వేల జీవితానికి అసోసియేట్ ప్రొడ్యూసర్ గా ఉద్యోగం చేసాడు.ఇక్కడే ప్రియదర్శి జీవితం ఒక మలుపు తిరిగిందని చెప్పాలి.
సినిమాలకు యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ ఎలా చేస్తారో అవగాహన చేసుకున్నాడు.ఆలా కొంత సినిమా సర్కిల్ పెరిగి, తన సొంత కథలను తయారు చేసుకొని వాటిని సినిమాలు గా చేయాలనీ అనుకున్నాడు.
ఆలా తాను దర్శకత్వం కూడా చేయాలనుకున్న ప్రియదర్శికి అవకాశాలు లభించలేదు.ఇక లాభం లేదని షార్ట్ ఫిలిమ్స్ పై ఫోకస్ చేసాడు.

చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి కార్పొరేట్ యాడ్స్ చేయడం, ఈవెంట్స్ షూట్ చేయడం మొదలు పెట్టాడు.ఆలా వచ్చిన డబ్బుతో షార్ట్ ఫిల్మ్ నిర్మాణం చేపట్టాడు.తానే నటిస్తూ దర్శకత్వం కూడా చేసాడు.ఇక తరుణ్ భాస్కర్ తో పరిచయం ప్రియదర్శికి కొత్త జీవితం ఇచ్చింది.బైపాస్ రోడ్ ఎల్ఎండీ కాలనీ అనే చిత్రంలో మొదట నటించే అవకాశం వచ్చింది.ఆ సినిమా విడుదల అయితే కాలేదు కానీ ఆ తర్వాత చేసిన మరికొన్ని చిన్న సినిమాలు కూడా విడుదలకు నోచుకోలేదు.

ఇక ప్రియదర్శి చేసి విడుదల అయినా మొదటి సినిమా టెర్రర్.ఇందులో నెగటివ్ పాత్రలో నటించాడు.ఆ తరువాత తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాలో అవకాశం ఇవ్వడం తో కమెడియన్ గా సెటిల్ అయ్యాడు.ఆ తర్వాత బొమ్మల రామారం సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించాడు ప్రియదర్శి.
అయితే ప్రియదర్శికి కమెడియన్ గా కాకుండా కోట, ప్రకాష్ రాజ్ లాగ విలన్ అవ్వాలనుకుంటే అది సాధ్యం కాలేదు.







