ప్రస్తుతం టీమిండియా టి20 ప్రపంచ కప్ 2022 ఆడేందుకు ఆస్ట్రేలియాలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.టీమిండియా టి20 ప్రపంచ కప్ 2022లో వరుస విజయాలతో దూసుకుపోతుంది.
ఈ టి20 వరల్డ్ కప్ లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు.టీమిండియాలో మంచి రికార్డు ఉన్న కెప్టెన్లలో కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోని అగ్రస్థానంలో ఉంటారు.
వీరు ముగ్గురు కెప్టెన్లు టీమ్ ఇండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కెప్టెన్ గా అవకాశం వచ్చినప్పుడు వీరు దాన్ని ఎంతో బాగా సద్వినియోగం చేసుకున్నారు.రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే కూడా కెప్టెన్లుగా ఉన్నప్పటికీ ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉండే అవకాశం రాలేదు.
వీళ్ళ సమయంలో ఆడే స్టార్ ప్లేయర్లు వివిఎస్ లక్ష్మణ్, జహీర్ ఖాన్ లకు కెప్టెన్ గా అవకాశం మాత్రం రాలేదు.ప్రస్తుతం భారత జట్టులోని అలాంటి కొంతమంది ఆటగాళ్లు ఇకపై కెప్టెన్ అయ్యే అవకాశం మాత్రం లేదు.
చెతేశ్వర్ పుజారా భారత జట్టు తరుపున వన్డే, టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇప్పటి వరకు కెప్టెన్‌గా అవకాశం మాత్రం రాలేదు.ఇంకా ఈ ఆటగాడికి కెప్టెన్గా అవకాశం మాత్రం కచ్చితంగా వచ్చే అవకాశం లేదు.
భారత జట్టులోని రవిచంద్రన్ అశ్విన్ కు కూడా ఇప్పటివరకు కెప్టెన్‌గా అవకాశం రాలేదు.

అశ్విన్ టెస్టు క్రికెట్‌లో 86 మ్యాచ్‌లు, వన్డేల్లో 113 మ్యాచ్‌లు ఆడాడు.టీ20 క్రికెట్‌లో టీమిండియా తరఫున అశ్విన్ 61 మ్యాచ్‌లు ఆడాడు.35 ఏళ్లు వయసు ఉన్న అశ్విన్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా కెప్టెన్సీ చేయలేదు.భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో అద్భుతంగా ఆడిన రవీంద్ర జడేజా కూడా కెప్టెన్‌గా అవకాశం రాని ఆటగాళ్లలో ఒకడు.జడేజా టెస్టు క్రికెట్‌లో 60 మ్యాచ్‌లు, వన్డేల్లో 171 మ్యాచ్‌లు ఆడాడు.
ఈ 33 ఏళ్ల ఆటగాడు టీ20లో 64 మ్యాచ్‌లు ఆడిన కూడా ఈ స్టార్ ప్లేయర్ కి కెప్టెన్ గా అయ్యే అవకాశం మాత్రం రాలేదు.







