గుడిలో దొంగతనాలు జరగడం సర్వసాధారణం.కొందరు దేవుడి గుడిలో దొంగతనం చేస్తూ ఆ దేవుడినే క్షమించమని అడుగుతూ ఉంటారు.
ఇలాంటి వింత చోరీ ఎన్నోసార్లు వెలుగు చూశాయి.కాగా మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలోని ఒక ఆలయంలో చోరీ చేసిన ఒక దొంగ ఎవరు ఊహించని ఓ పని చేశాడు.
ఈ ఆలయంలో కొట్టేసిన వెండి, ఇత్తడి వస్తువులను దొంగ తిరిగి ఇచ్చారు.ఈ ఆలయంలో దొంగతనం చేసిన సమయం నుంచి తనను కష్టాలే వెంటాడని.
చివరికి తన తప్పు తాను తెలుసుకున్నారని అందుకే వీటిని తిరిగి ఇచ్చేస్తున్నారని అతడు ఒక లెటర్ కూడా రాశాడు.
వివరాల్లోకి వెళ్తే.
అక్టోబరు 24న లమ్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినాథ్ దిగంబర్ జైన్ టెంపుల్‌లో ఒక దొంగ పడ్డాడు.ఈ దొంగ ఛత్రాలు అని పిలిచే గొడుగు ఆకారంలో ఉన్న అలంకరణ ముక్కను, మూడు ఇత్తడి వస్తువులు, 10 అలంకారమైన వెండి ముక్కలను దొంగలించాడు.
అప్పటి నుంచి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఈ క్రమంలోనే శుక్రవారం, లామ్టాలోని పంచాయితీ కార్యాలయం సమీపంలో ఓ గొయ్యిలో ఒక బ్యాగ్ ప్రత్యక్షమైంది.
దీంతో స్థానికులు పోలీసులను, సంఘ సభ్యులను సమాచారం అందించారు.

ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా అందులో చోరీకి గురైన వస్తువులు కనిపించాయి.అందులో ఒక లెటర్ కూడా ఉంది.ఆ లేఖలో ‘ఆలయంలోని వస్తువులను దొంగలించినందుకు నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను.
నేను తప్పు చేసాను, నన్ను క్షమించు.దొంగతనం తర్వాత చాలా బాధపడ్డాను.’ అని రాశాడు ఆ దొంగ.దాంతో అవాక్కవడం పోలీసులు వంతు అయింది.
స్థానికులు మాత్రం దేవుడు ఆ దొంగ కళ్ళు తెరిపించాడని, ఇదంతా దేవుడు మహత్యం అని అంటున్నారు.కాగా ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది.