Prabhas Adipurush : ఆదిపురుష్ వార్తలని నమ్మలేక పోతున్న అభిమానులు

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా హిందీలో రూపొందుతున్న ఆదిపురుష్ సినిమా వచ్చే సంవత్సరం జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా మొన్నటి వరకు ప్రకటించిన విషయం తెలిసిందే.దసరా దీపావళి సందర్భంగా విడుదలైన పోస్టర్స్ లో మరియు వీడియోలు జనవరి 12, 2023 సంవత్సరం లో సినిమా ను ప్రేక్షకుల ముందుకు ప్రపంచ వ్యాప్తంగా తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

 Prabhas Adipurush Movie Release Date Postponed And Fans Fire , Adipurush, Flim N-TeluguStop.com

కానీ గత రెండు మూడు రోజులుగా సినిమా వాయిదా పడబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.అయితే ప్రభాస్ అభిమానులు ఆ వార్తలను కొట్టి పారేశారు.

టాలీవుడ్ స్టార్ హీరో లు చిరంజీవి మరియు బాలకృష్ణ నటించిన సినిమా లు ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కానుకగా రాబోతున్నాయి కనుక ఆ సినిమా లకు పోటీ వద్దు అనే ఉద్దేశంతోనే ఆదిపురుష్ సినిమా ను వాయిదా వేసి ఉంటారు అంటూ చాలా మంది మాట్లాడుకున్నారు.కానీ అవేవీ ప్రభాస్‌ అభిమానులు నమ్మలేదు.

Telugu Adipurush, Om Routh, Prabhas, Telugu-Movie

తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు డిస్ట్రిబ్యూటర్స్ కి సినిమా వాయిదా విషయమై సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.సినిమా సంక్రాంతికి విడుదల చేయడం వల్ల కలిసి వచ్చే అంశాల కంటే కష్టంగా మారే అంశాలు ఎక్కువగా ఉన్నాయని.అందుకే సినిమా ను సంక్రాంతి కి కాకుండా వచ్చే సంవత్సరం సమ్మర్లో సోలో రిలీజ్ చేద్దాం అన్నట్లుగా చెప్పుకొచ్చారట.పైగా సినిమా కు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పెండింగ్ లో ఉందని.

విడుదల సమయానికి అది పూర్తి అవుతుందని నమ్మకం లేదని కూడా చిత్ర దర్శకుడు మరియు నిర్మాతలు బయ్యర్స్ తో మాట్లాడినట్లుగా తెలుస్తుంది.ఈ వార్తలపై ప్రభాస అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్ రేంజ్ లో రూపొందిన ఆదిపురుష్ సినిమా కేవలం తెలుగులో విడుదల కాబోతున్న సినిమాల వల్ల వాయిదా పడడం సిగ్గు చేటు అంటూ తీవ్ర వ్యాఖ్యలు గుప్పిస్తున్నారు.ఆదిపురుష్ నిర్మాతల పద్ధతిపై ప్రభాస్‌ అభిమానులు అసంతృప్తితో ఉన్నారు.

ఈ సినిమా లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా సినిమాను చూడడం కోసం ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube