జియో ఫైబర్ బంపర్ ఆఫర్... ఛార్జీలు లేకుండానే కొత్త కనెక్షన్‌!

జియో ఫైబర్ గురించి అందరికీ తెలిసిందే.ఇపుడు భారత దేశంలోనే అతిపెద్ద ఫిక్స్‌డ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌ ఏదన్నా వుంది అంటే అది జియో ఫైబర్ అని చెప్పుకోవచ్చు.

 Jio Fiber Bumper Offer New Connection Without Charges , Jio Fiber, Jio Fiber Off-TeluguStop.com

జియో ఫైబర్ ఎప్పటికప్పుడు కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకువస్తోంది.అవును, తాజాగా వచ్చిన ఆఫర్ కింద కొత్త కనెక్షన్‌ని బుక్ చేసుకోవడానికి కస్టమర్‌లు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన పని లేదు.

అయితే కొన్ని షరతులు మాత్రం వర్తిస్తాయి.పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు మాత్రమే ఈ జియో ఆఫర్ ప్రయోజనాన్ని పొందుతారు.

ఇక పొతే జియో కంపెనీ చాలా కాలంగా ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు జియో ఫైబర్ సేవలను దిగ్విజయంగా అందిస్తోంది.ఇక వచ్చిన ఈ తాజా ఆఫర్ కింద వినియోగదారులు ఎటువంటి కనెక్షన్ ఛార్జీలు లేకుండానే జియో ఫైబర్ కనెక్షన్‌ను పెట్టుకోవచ్చు.

దీని కోసం వినియోగదారులు ఇన్‌స్టాలేషన్ లేదా డిపాజిట్ వంటివి అవసరం లేదు.ఇక జియో పోస్ట్‌పెయిడ్ బేసిక్ ప్లాన్‌ రూ.499 అన్న సంగతి తెలిసినదే.

Telugu Provider, Jio Fiber, Tech-Latest News - Telugu

జియో ఫైబర్ చౌకైన ప్లాన్ రూ.499 రీఛార్జ్ ప్లాన్ కస్టమర్లకు 6 OTT యాప్‌లకు యాక్సెస్ ఇవ్వడం విశేషం.ఈ ఆఫర్లో 30Mbps వేగం కలిగి ఉంటుంది.అలాగే రూ.599 రీఛార్జ్ ప్లాన్‌లో కస్టమర్లు 14 OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందుతారని గుర్తుపెట్టుకోండి.డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ లైవ్, ఇతర ప్లాన్‌లకు కస్టమర్లకు యాక్సెస్ ఉంటుంది.ఇది వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్‌లను, 550కి పైగా ఆన్-డిమాండ్ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.

మీరు ఈ ప్లాన్‌ను 6 నెలలు లేదా 12 నెలల పాటు కూడా కొనుగోలు చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube