వామ్మో ఇది గ్యాడ్జెట్టాలాగా లేదు, భూతంలాగా వుంది!

పెరిగిపోతున్న టెక్నాలజీ మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.అవును, ఇపుడు మనిషి పనిచేయడం తగ్గిపోయి యంత్రాలు పనిచేయడం మొదలైంది.

 Wham It's Not Like A Gadget, It's Like A Monster, Gadgets, Light Gadget, Tech N-TeluguStop.com

ఒకప్పుడు టీవీ ఆన్ చేయాలంటే ఖచ్చితంగా దగ్గరకు వెళ్లాల్సిందే.కానీ నేడు అలా కాదు మనం వున్నచోటినుండి రిమోట్ కాంట్రాల్ తో ఆపరేట్ చేయచ్చు.

ఈ క్రమంలోనే నడిచే లాంతర్లు వచ్చాయి.మనదగ్గర తక్కువగానే ఫారిన్ దేశాలలో ఇలాంటివి ఎక్కువగా వాడుతారు.

లాంతరు పట్టుకుని మనిషి నడవాలి కానీ, లాంతరు దానికదే నడవడం ఏమిటని మీకు అనుమానం రావచ్చు.

అక్కడికే వస్తున్నా.

ఇక్కడ హైటెక్‌ లాంతరు మాత్రం తనంతట తానే నడుస్తుంది.రాత్రివేళ ఇంట్లో దీపాలార్పేసి, దీన్ని వెలిగించుకుంటే ఈ లాంతరు ఒక్కటే దానంతట అదే ఇల్లంతా కలియదిరుగుతూ రంగు రంగుల్లో వెలుగులు విరజిమ్ముతూ కాపలాగా ఉంటుంది ఒక కుక్కమాదిరి.

ఇక దీనిని కొత్తగా చూసేవాళ్లు ఇదేదో కొరివిదెయ్యంలా ఉందనుకుని భయపడే అవకాశాలు కూడా మెండుగా వున్నాయి.మామూలుగా చార్జింగ్‌ చేసుకుని వాడుకునే ఎమర్జెన్సీ దీపాల్లాగానే దీనిని వాడుకోవచ్చు.

అయితే, దీనికింద సాలీడు కాళ్లలాంటి రోబోటిక్‌ కాళ్లను అమర్చడం వల్ల ఇది చాలా సునాయాసంగా నడవగలుగుతుంది.జపాన్‌కు చెందిన ఐటీ ఇంజనీర్‌ ఇయానియస్‌ తన ప్రాజెక్టులో భాగంగా దీనికి రూపకల్పన చేయడం జరిగింది.దీని తయారీ కోసం త్రీడీ ప్రింటింగ్‌ ద్వారా ముద్రించిన విడిభాగాలను ఉపయోగించాడు అతను.దీని పనితీరును ప్రత్యక్షంగా చూపడానికి తీసిన వీడియో ‘ట్విట్టర్‌’లో పెడితే, కొద్ది గంటల్లోనే అది వైరల్‌గా మారి సంచలనం సృష్టించింది.

కాగా కొంతమంది నెటిజన్లు దీనిపైన ప్రేమలో పడిపోయారు.తమకి కూడా అలాంటివి కావాలని ఆన్లైన్ మార్కెట్లో తెగ వెతికేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube