నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతూ ఉన్నాడు.ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వం లో వీరసింహారెడ్డి సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.
వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా ఇటీవలే అధికారికంగా ప్రకటన వచ్చింది.వీరసింహారెడ్డి సినిమా తర్వాత బాలకృష్ణ నటించబోతున్న సినిమా ఇప్పటికే అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది.
అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలకృష్ణ హీరో గా సినిమా రూపొందబోతుంది.వచ్చే నెలలో బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
ఈ సమయం లోనే సర్కారు వారి పాట సినిమా తో బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కించుకున్న దర్శకుడు పరశురాం త్వరలోనే తాను బాలకృష్ణ గారికి ఒక కథ చెప్పబోతున్నానని.తప్పకుండా అది ఆయనకు నచ్చుతుందని నమ్మకంతో ఉన్నట్లుగా పేర్కొన్నాడు.
వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ను అల్లు అరవింద్ నిర్మించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది.సర్కారు వారి పాట సినిమా తర్వాత నాగ చైతన్య హీరో గా పరుశురాం సినిమా తెరకెక్కించాల్సి ఉంది.కానీ నాగ చైతన్య అంతకు ముందే వెంకట్ ప్రభు దర్శకత్వం లో సినిమా కమిట్ అవ్వడం వల్ల పరుశురాం కి డేట్లు ఇవ్వలేక పోయినట్లుగా తెలుస్తోంది.అల్లు అరవింద్ ఇప్పటికే పరశురాం వద్ద ఉన్న కథ ను మెచ్చడం దాన్ని బాలకృష్ణ కు అయితే బాగుంటుందని భావించడం జరిగిందట.
ప్రస్తుతం ఆ కథ కు తుది మెరుగులు దిద్దుతున్న దర్శకుడు పరశురాం త్వరలోనే బాలకృష్ణకు వినిపించబోతున్నట్లుగా ప్రకటించాడు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే సంవత్సరం సమ్మర్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
గీత ఆర్ట్స్ లో బాలకృష్ణ సినిమా అంటే ఒక రకమైన ప్రచారం మొదలవ్వబోతుంది.మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.