గుజరాత్ కేబుల్ బ్రిడ్జ్ ఘటనపై సిట్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..!!

గుజరాత్ లో మోర్జీ పట్టణంలో మచ్చూ నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కుప్ప కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్యతో పాటు క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుంది.ఇప్పటికే దాదాపు 60 మందికి పైగా మరణించడం జరిగింది.

 State Govt Formed Sit On Gujarat Cable Bridge Incident, Sit, Gujarat Cable Brid-TeluguStop.com

ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కేబుల్ బ్రిడ్జి ప్రమాద ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.ఇదే సమయంలో ఘటనా స్థలానికి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ బయలుదేరి వెళ్లారు.

మరోపక్క పోలీసులు ఇంకా రెస్క్యూటిమ్ భారీ ఎత్తున సహాయక కార్యక్రమాలు చేపడుతూ ఉంది.క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు పరిహారం కింద ప్రకటించడం జరిగింది.

ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జ్ పై ఐదువందలమంది ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.దీంతో అధికారులు సహాయక కార్యక్రమాలలో ముమ్మరంగా పాల్గొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube