మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఆచార్య ప్లాప్ తో ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని గాడ్ ఫాదర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగాస్టార్.
ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంతో మెగాస్టార్ ఆనందంగా ఉన్నాడు.ఇక ఈ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు మరో సినిమాను రెడీ చేస్తున్నాడు.గాడ్ ఫాదర్ సినిమా తర్వాత వెంటనే మరో సినిమాను ఫ్యాన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు అన్ని సిద్ధం చేస్తున్నాడు.చిరు చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఒకటి.
ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ఇటీవలే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసారు.
రాజమండ్రి లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసి మెగాస్టార్, రవితేజ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాతో మెగాస్టార్ వింటేజ్ లుక్ వైరల్ అవుతుంది.బోస్ ఈజ్ బ్యాక్ అనే రేంజ్ లోకి ఈ లుక్ వెళ్ళిపోయింది.
ఇక తాజాగా స్టూడెంట్స్ మెగా ట్రిబ్యూట్ చుసిన వారంతా ఫిదా అవుతున్నారు.ఈ క్రమంలోనే డైరెక్టర్ బాబీ మెగా ట్రిబ్యూట్ వీడియోను షేర్ చేస్తూ తన ఆనందం వ్యక్తం చేసాడు.
దాదాపు 6 వేల మంది స్టూడెంట్స్ కలిసి కాలేజ్ గ్రౌండ్ లో మెగాస్టార్ రూపం తీర్చిదిద్ది మెగా ట్రిబ్యూట్ అందించారు.ఈ మెగాస్టార్ పిక్ గెటప్ లో స్టూడెంట్స్ అంతా కూర్చుని అదరగొట్టారు.ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఇది కదా మెగా ట్రిబ్యూట్ అంటూ ఫ్యాన్స్ సైతం ఆనందిస్తున్నారు.
దీంతో ఈ వీడియోను బాబీ కూడా షేర్ చేస్తూ ఆ స్టూడెంట్స్ కు యాజమాన్యానికి థాంక్స్ తెలిపారు.







