ఆందోళనలో మునుగోడు అభ్యర్థులు.. మైండ్ గేమ్ ఆడుతున్న ఓటర్లు.. ఏం చేస్తున్నారంటే?

మునుగోడులో ప్రచారం తుది ఘట్టానికి చేరుకుంది.మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనుంది.

 Munu Godu Voters Playing Mind Game Details, Munu Godu, By-elections, Mind Game,-TeluguStop.com

దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ తమ ప్రచారంలో వేగం పెంచాయి.అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడంతో ఈ ఎన్నికపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపొందుతుందనే విషయంపై ఎవరికీ ఎలాంటి స్పష్టత లేదు.ఓటర్లు ఎవరికీ ఓటు వేయాలో ముందుగానే నిర్ణయించుకున్నారు.

కానీ ఎవరూ ముందుకొచ్చి చెప్పడం లేదు.టైం తక్కువగా ఉండటంతో ఉన్న టైంను క్యాష్ చేసుకుంటున్నారు ఓటర్లు.

ఎక్కడ నోరు విప్పితే.తమ ప్రయోజనాలు చేజారిపోతాయని భావిస్తున్నారు.

ఎవరికి ఓటు వేస్తామని ముందే చెప్పేస్తే ఇతర పార్టీల నాయకుల నుంచి ప్రయోజనాలు పొందలేమని ఓటర్లు అర్థం చేసుకున్నారు.ఈ క్రమంలో ఎవరికీ ఓటు వేస్తామనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు.

ఓటు అడగడానికి వచ్చిన ప్రతి అభ్యర్థికి తమ పార్టీకే ఓటు వేస్తామని చెప్పి.ప్రయోజనాలు పొందుతున్నారు.

అయితే ఈ ఎన్నికల్లో ఏ అభ్యర్థి ఎలాంటి వాడో తమకు ముందే తెలుసని, సడెన్‌గా ఉప ఎన్నికలు రావడం, మునుగోడు అభివృద్ధిపై ఫుల్ క్లారిటీతో ఓటర్లు ఉన్నారు.

ఏ పార్టీలో గెలిచినా.

చివరికీ వేరే పార్టీ కండువా కప్పుకుంటున్నారు.అసలు పార్టీ మారాల్సిన అవసరం ఎందుకుంది.

Telugu Congress, Mind Game, Munu Godu, Munugode, Praja Shanti, Rajagopal Reddy-P

ఈ విషయాలన్నింటిపై తమకు స్పష్టత ఉందని ఓటర్లు చెబుతున్నారు.ఎన్నికల ప్రచారంపై ఓ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి.దీంతో మునుగోడు ఎన్నికలపై ఆసక్తి మరింత రేకెత్తింది.అయితే ఆయా పార్టీల అభ్యర్థుల్లో మాత్రం భయాందోళన మొదలైంది.ఎందుకంటే ఓటర్ల మదిలో ఏముందనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు.పోలింగ్ దగ్గర పడుతున్నా.

బూత్‌ల వారీగా ఓట్లు లెక్కించుకున్నా.అంచనా వేయలేకపోతున్నారు.

మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనుంది.ఈ రెండు రోజుల్లో ఆయా పార్టీలు ఎంత వరకు ఓటర్లను సంతృప్తి పరుస్తారో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube