హిందువులకు తమ ఇష్టదైవాలంటే ఎనలేని ప్రీతి.వారికీ తోచిన రీతిలో తమ భక్తిని చాటుకుంటూ వుంటారు.
ఒక భక్తురాలు అరటిపండుతో కొలిస్తే, మరోభక్తురాలు పరమాన్నం వండి నైవేద్యంగా పెడుతుంది.మరొకరు పంచభక్ష పరమాన్నాలతో తమ భక్తిని చాటుకుంటారు.
ఇక కళాకారులైతే తమ కళను చాటుకుంటూ భక్తిని చాటుకుంటూ వుంటారు.అవును, ఇపుడు అలాంటి ఓ కళాకారురాలి కళను చూసి నెటిజన్లు సంబరపడిపోతున్నారు.
ఒక అమ్మాయి రాముడి పేరును 1 లక్ష కంటే ఎక్కువ సార్లు వివిధ రంగులలో తీసుకొని అద్భుతమైన కళాకృతిని ప్రదర్శించింది.
రిటైర్డ్ ఎయిర్ మార్షల్ ఏవియేటర్ అనిల్ చోప్రా తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో అమ్మాయి గీసిన అద్భుతమైన పెయింటింగ్ వీడియోను షేర్ చేశారు.
కాగా ఈ వీడియోలో ఒక అమ్మాయి 10,0011 లక్షల సార్లు రాముడి పేరు రాసి.రాముడు, సీత, లక్ష్మణ సమేత హనుమంతుని పెయింటింగ్‌ను అవలీలగా గీసింది.కాగా ఇది చూసినవారు ఆశ్చర్యపోతున్నారు.బహుశా మీరు ఇలాంటివి ఇంతకు ముందు చూసేవుంటారు.
అయితే ఈమె గీసిన విధానాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు.తెల్లటి కాగితంపై రంగు పెన్నుతో రాముడి పేరు రాసిన ఆమె రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతునితో ఉన్న చిత్రం ఆవిష్కరించింది.

ఇక ఈ బొమ్మ గీస్తున్నపుడు ఆ అమ్మాయి మొహంలో ఎలాంటి అలసట కనిపించకపోవడం గమనార్హం.అయోధ్యలో నిర్మితమవుతున్న రామమందిరంలో ఈ అద్భుతమైన కళాఖండాన్ని ఇన్‌స్టాల్ చేయాలని చాలా మంది నెటిజన్లు కోరుకుంటున్నారు.రామ మంత్రాన్ని జపించడం కంటే రాయడం చాలా ప్రభావవంతంగా ఉంటుందని మరికొందరు జనాలు అభిప్రాయపడుతున్నారు.రాముని భక్తులకు మరో శుభవార్త ఏమంటే, 2023 డిసెంబరు నాటికి అయోధ్య రాముని ఆలయం మొదటి అంతస్తును సిద్ధం చేస్తామని అక్కడ సిబ్బంది అంటున్నారు.







