యాదాద్రి జిల్లా:మునుగోడులో బహుజనులంతా తెగించి,ఏ పార్టీలకు భయపడకుండా ఏనుగు గుర్తుకు ఓటేసి పాలకులం అవుదామని బిఎస్పీ రాష్ట్ర చీఫ్ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.
శనివారం సంస్థన్ నారాయణపూర్ మండల కేంద్రంలో బహుజన ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడుతూ ఆధిపత్య పార్టీల ప్రలోభాలకు లొంగితే బానిసలం అవుతామని గుర్తుచేశారు.అన్ని ఆధిపత్య పార్టీలు కోట్ల గురించి తప్ప పేదలను పట్టించుకోవడం లేదన్నారు.
మునుగోడు నియోజకవర్గం అంతా సమస్యలతో నిండి ఉందన్నారు.టిఆర్ఎస్,బిజెపి పార్టీలు బిసిలను దారుణంగా అవమానించాయని విమర్శించారన్నారు.
ఎనిమిదేళ్ళుగా పట్టించుకోకుండా ఇపుడు దత్తత గురించి మాట్లాడే కెటిఆర్,హరీష్ రావుకు సిగ్గు లేదన్నారు.సిఎం లెంకలపల్లికి వస్తే 200 మంది సెక్యూరిటీ ఎందుకని ప్రశ్నించారు.
ఎందుకంత భయపడుతున్నారని,దమ్ముంటే మాలాగా ప్రజల్లో తిరిగి ప్రచారం చేయాలన్నారు.రేపు మీటింగ్ పెట్టి మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తారని,ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు.70 ఏళ్లుగా ఆధిపత్య వర్గాలు మనల్ని మోసం చేశాయని,ఈ సారి మనం వారిని మోసం చేద్దామన్నారు.చిల్లర నా కొడుకుల్లారా అని అవమానించిన బిజెపిని ఓడించాలన్నారు.
దేశాన్ని నడిపేది, మోడినా,స్వామీజిలా అని పంరశ్నించారు.సిబిఐ,ఈడి కేసులు కాకుండా చూసుకుంటామని స్వామీజీలు అనడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇరవై ఏళ్లుగా కారును భరిస్తున్నాం,ఇక అవసరం లేదన్నారు.కాంగ్రెస్,టిఆర్ఎస్,బిజెపి పార్టీలోని బహుజనులారా ఓటు మాత్రం ఏనుగుకే వేయాలని కోరారు.
మునుగోడులో అన్ని ఆధిపత్య పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే,బిఎస్పి మాత్రం బిసి వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చిందన్నారు.బిఎస్పి అన్ని పార్టీల వలె డబ్బు పంచదని,మద్యం,ఇతర ప్రలోభాలకు గురి చేయదని గుర్తు చేశారు.
ప్రజలనే ఓటు,నోటు అడుగుతుందని తెలిపారు.ప్రజలందరికి ఓటు అమ్ముకోవద్దని, బాబాసాహెబ్ అంబేడ్కర్ ఓటు అమ్ముకోడానికి ఇవ్వలేదని గుర్తు చేశారు.
ఓటు అమ్ముకోం,మహనీయుల ఆశయాలను నెరవేరుస్తం అని వాగ్దానం చేయించారు.మునుగోడులో గెలిస్తే తెలంగాణ,ఢిల్లీ బహుజనుల వశం అవుతాయని పేర్కొన్నారు.
బిజెపి పాలనలో దేశ వ్యాప్తంగా దళిత బహుజనులపై దాడులు జరుగుతున్నాయని,అత్యాచారం,హత్యలు జరుగుతున్నాయని విమర్శించారు.పార్టీ ప్రధాన కార్యదర్శి మంద ప్రభాకర్ మాట్లాడుతూ ఆధిపత్య పార్టీల కార్యక్రమాల్లో బహుజనులను కింద కూర్చోబెట్టి,ఎన్నికల కూలీలను కూర్చోబెడుతున్నారు,కానీ,బిఎస్పి మాత్రం మన పేద వర్గాలను గౌరవంగా అతిథులుగా కూర్చోబెడుతుందని తెలిపారు.
సబ్బండ కులాల,మహిళలు, మైనారిటీల బతుకులు మారాలంటే ఏనుగు గుర్తుకే ఓటేయాలన్నారు.మునుగోడు ఎన్నిక బహుజనులు,ఆధిపత్య వర్గాల మధ్య యుద్ధం అని పేర్కొన్నారు.
రాజగోపాల్ రెడ్డి గాని,ప్రభాకర్ రెడ్డి గానీ ఒక్క రూపాయి,ఒక మద్యం బాటిల్ ఇవ్వకుండా వంద ఓట్లు తెచ్చుకోగలరా అని సవాల్ చేశారు.అందుకే అన్ని పార్టీలలోని బహుజనులు ఏనుగు గుర్తుకు ఓటేసి బిఎస్పిని గెపించాలని కోరారు.
బిఎస్పి అభ్యర్థి శంకరాచారి మాట్లాడుతూ గత ఏడు దశాబ్దాలుగా ఆధిపత్య పార్టీలు బహుజనులను మోసం చేశాయన్నారు.స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా,రోడ్డు సౌకర్యాలు,విద్య,వైద్య సౌకర్యాలు లేవని గుర్తుచేశారు.
గత ఎమ్మెల్యేలంతా కనీస వసతులు కల్పించడంలో విఫలం చెందాయన్నారు.అందుకే ఈ ఆధిపత్య దొరలను ఓడించి మన బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించుకొని నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకోవాలని తెలిపారు.
మునుగోడు అభివృద్ధి కావాలంటే ఏనుగు గుర్తుకే ఓటేయాలని కోరారు.ముందుగా మండల కేంద్రంలోని శివాలయం నుండి ప్రారంభమై వేలాది మంది బీఎస్పీ కార్యకర్తలతో డప్పులు,బోనాలు, బతుకమ్మలు,ఆదివాసీ నృత్యాలతో భారీగా ర్యాలీతో సభ ప్రాంగనానికి చేరారు.







