జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో విశాఖ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తన ఒక్కడి వల్లే సమాజంలో అద్భుతాలు జరుగుతాయని నమ్మడం లేదని తెలిపారు.
సమాజంలో ఒక మంచి సమూహాన్ని.మంచి ఆలోచనలతో తయారు చేయటానికి జనసేన పార్టీని ఓవేదికగా నిర్మించినట్లు స్పష్టం చేశారు.
ఇదే సమయంలో తన పిల్లలకి మంచి విద్యను ఇవ్వగలను.డబ్బు, ఇల్లు, బట్టలు మరియు ఇతర సౌకర్యాలు ఇవ్వగలను.
కానీ వారు బతకడానికి మంచి సమాజం తీసుకురావాలంటే నేనేం చేయాలని ఆలోచనతోనే రాజకీయాల వైపు రావడం జరిగిందని పవన్ స్పష్టం చేశారు.చట్టం కొంతమందికి ఎందుకు బలంగా పనిచేస్తుంది అన్న సందిగ్ధంలో.
ఆలోచనలతో ఒక పయనం ఈరోజు ఈ రీతిగా ఒక సమూహాన్ని తయారు చేసే రీతిలో నడిపిందని స్పష్టం చేశారు.గతంలో ఎన్నికల అనంతరం పార్టీ ఆఫీసులో ఓ మహిళ తనని కలవడం జరిగిందని తెలిపారు.
అయితే తన 14 ఏళ్ల కుమార్తెను అత్యాచారం చేసి చంపేశారని.

ఎవరు పట్టించుకోలేదని అత్యాచార ఘటనకు సంబంధించిన వివరాలు తనతో పంచుకుంది అని తెలిపారు.ఇంటి నుంచి స్కూలుకి వెళ్లిన బిడ్డకు తగిన రక్షణ లేనప్పుడు మనం ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వచ్చే కోపం వర్ణించలేము అని ఎన్నోసార్లు నాలో నేను దహించుకుపోయాను.ఈ క్రమంలో పోరాటమే మార్గంగా ఎంచుకున్నాను అని పవన్ విశాఖ నేతలతో సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది.







