రాజకీయంగా ఎత్తుల కు పైఎత్తులు వేయడంలో టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ బాగా ఆరితేరిపోయారు.ఇప్పటికే రెండుసార్లు టిఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయిన కెసిఆర్, మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు.
అంతకంటే ముందుగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలిచికోవాలని చూస్తున్నారు.దీనిలో భాగంగానే ఇప్పటికే మంత్రులు , ఎమ్మెల్యేలు, ఇతర కీలక నాయకులను గ్రామాలు, మండలాల వారిగా ఇన్చార్జీలుగా నియమించారు.
వారి ద్వారానే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.దీంతో పాటు రైతుబంధు కార్యక్రమం తో పాటు, దళిత బంధు వంటి పథకాల లబ్ధిదారులు తమకు అండగా ఉంటారని కేసీఆర్ భావిస్తున్నారు.ముఖ్యంగా బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి చౌటుప్పల్ మండలం లో మంచి పట్టు ఉండడంతో , అక్కడ టిఆర్ఎస్ తరఫున ఇన్చార్జిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కెసిఆర్ నియమించారు.ఇప్పటికే మంత్రి కేటీఆర్ సైతం మునుగోడును దత్తత తీసుకుంటామంటూ ప్రకటించారు.
ఇక మునుగోడులో గెలిచేందుకు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా స్థానిక నాయకులతో మాట్లాడుతూ , వారు ఏ విధంగా ముందుకు వెళితే సక్సెస్ అవుతారు అని వివరించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు.గ్రామాల వారిగా మండలాల వారిగా ప్రజలను ఆకట్టుకునేందుకు ఏం చేయాలనే విషయం పైన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
ప్రతి గ్రామానికి ఒక ఎమ్మెల్యే ను ఇన్చార్జిగా ఇప్పటికే నియమించారు.రేపు భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు పగడ్బందీగా చేస్తున్నారు.

ఎమ్మెల్యే లకు బాధ్యతలు అప్పగించడంతో పాటు .ఎవరు ఏం చేస్తున్నారనేది తాను విశ్లేషించుకుంటానని, సర్వే నివేదికల ఆధారంగా టిక్కెట్ల కేటాయింపులు ఉంటాయని, ఇప్పటికే కేసీఆర్ హెచ్చరికలు చేశారు.ప్రస్తుతం మునుగోడులో చోటు చేసుకుంటున్న ప్రతి చిన్న పరిణామాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఓటర్లు మనో గతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఇతర పార్టీలకు ఓటు వేసినా.
అది నిరూపియోగంగా మారుతుందని, అదే టిఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించడం ద్వారా, ఈ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందనే విషయాన్ని మునుగోడు ఓటర్లకు సవివరంగా తెలియజేయాలంటూ కేసిఆర్ మునుగోడు ఇన్చార్జి బాధ్యతలు చూస్తున్న నాయకులకు హిత బోధ చేశారట.







