నాన్ వెజ్ ప్రియులారా! ఇది విన్నారా? మీరు విన్నది నిజమే.మీరు అక్కడ మటన్ కొని చికెన్ ఉచితంగా పట్టుకెళ్లండి.
పండుగల వేళ కస్టమర్లను ఆకట్టుకునేందుకు వ్యాపారులు పలు రకాలైన డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు.బట్టల షాపులో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నమాదిరి నాన్ వెజ్ విషయంలో కూడా ఊరించి జనాలకి గాలం వేస్తున్నారు.
అవును, ఒక మటన్ అండ్ చికెన్ షాప్ యజమాని పెట్టిన ఆఫర్ అందరినీ ఆకర్షిస్తోంది.జగిత్యాలలోని శ్రీశాంత్ మటన్ అండ్ చికెన్ సెంటర్ యాజమాని ఈ బంపర్ ఆఫర్ ప్రకటించాడు.
ఈ షాప్ ఓనర్ మటన్ కొనుగోలుపై భారీ ఆఫర్ ప్రకటించడంతో జనాలు క్యూలు కడుతున్నారు.ఒక కేజీ మటన్ కొంటే అరకిలో చికెన్ ఫ్రీ అంటూ షాపు ముందు ఫ్లెక్సీ పెట్టాడు.అదేకాకుండా అరకిలో మటన్ కొంటే 250 గ్రాముల చికెన్, 3 కేజీల మటన్ కొంటే 1.5 కేజీల చికెన్, 5 కేజీల మటన్ తీసుకుంటే 2.5 కేజీల చికెన్ ఉచితం, అలాగే 10 కేజీల మటన్ తీసుకుంటే 5 కేజీల చికెన్ ఉచితంగా ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించేశాడు.దాంతో స్థానికులు అక్కడ మాంసాన్ని వేలంవెర్రిగా కొంటున్నారు.
కాగా ఈ ఆఫర్ ప్రతిరోజు ఉంటుందని, కానీ శనివారం, ఆదివారం షాపుకు సెలవు అని ఫ్లెక్సీలో రాసుకొచ్చాడు.

కాగా ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నెటిజన్లు ఆఫర్ చాలా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే ఈ షాపు కొత్తగా ప్రారంభించడంతో ఈ ఆఫర్ పెట్టారని, దీని వల్ల బిజినెస్ బాగా పెరుగుతుందని స్థానికులు అంటున్నారు.
కస్టమర్లను ఆకర్షించేందుకు ఇదొక మంచి బిజినెస్ ట్రిక్ అని నెట్టింట జనాలు గుసగుసలాడుకుంటున్నారు.మరెందుకాలస్యం, మీరు కూడా ఇలాంటి బిజినెస్ ట్రిక్ ఒకటి ట్రై చేసి చూడండి.







