ఈసీ జారీ చేసిన నోటీస్కు మంత్రి జగదీశ్ రెడ్డి సమాధానం ఇచ్చారు.ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారికి ఆయన వివరణ లేఖ రాశారు.
మునుగోడులో బీజేపీ ఓటమి ఖాయం అయిందని తెలిపారు.అందుకే తమపై రకరకాలుగా ఫిర్యాదు చేస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు.
పథకాలు ఆగిపోతాయని తను చెప్పినట్టుగా ఈసీకి తప్పుడు ఫిర్యాదు చేశారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
అనంతరం ఈసీ ఇచ్చిన నోటీసుకు తాను సమాధానం ఇచ్చినట్లు స్పష్టం చేశారు.అయితే, నిన్న మంత్రి జగదీశ్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఫిర్యాదు మేరకు ఈసీ అధికారులు నోటీస్ అందించిన సంగతి తెలిసిందే.







