ప్రపంచంలోనే నంబర్ 1 సోషల్ మీడియా దిగ్గజం అయినటువంటి ట్విట్టర్ CEO… కాదుకాదు ఇపుడు మాజీ CEO అని అనాలేమో.అతడేనండి మన భారతీయుడైన పరాగ్ అగర్వాల్ గురించి అందరికీ తెలిసిందే కదా.
విషయం ఏమంటే, ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు పూర్తి చేసిన వెంటనే ట్విట్టర్ CEO, CFO, లీగల్ సెల్, సహా కీలక ఉన్నతాధికారులను తొలగించేశాడు.ఇపుడు అతను ట్విట్టర్ బాస్ కావడంతో తొట్టతొలిగా అందులోంచి మన భారతీయులైన పరాగ్, విజయ్ గద్దె లాంటి కొంతమంది ఉన్నతాధికారులను తీసిపడేశారు.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ సందడి చేస్తున్నాయి.అవును, ట్విట్టర్ CEOకే ఉద్యోగ భద్రత లేదు.ఇక సామాన్యలు ఎంత? అని నెటిజన్లు సో కాల్డ్ ప్రైవేట్ సెక్టార్ జాబ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు.మస్క్ ట్విట్టర్ టేకోవర్ కాగానే.
అతనికి నచ్చని, అతనికి ఎదురు తిరిగిన కొంతమంది ఉద్యోగులను పైకి పడేసాడు.ఈ విషయంపైన ట్విట్టర్ లోనే మీమ్స్ చక్కెర్లు కొడుతున్నాయి.
ట్విట్టర్ CEO జాబ్ కంటే భారత గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా బెటర్ అని కొందరంటే, ఇక్కడ పనిచేసినా, చేయకున్నా తీసిపారేసేవారే ఉండరని కొందరు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

ఇక కొందరైతే గవర్నమెంట్ జాబ్ అయితే మా ఊరిలో వుండే కిక్కే వేరప్పా అంటూ ఏకంగా పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులను మీమ్స్ చేస్తున్నారు.ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబే తప్ప మనకు కోపం వచ్చినా.యజమానికి కోపం వచ్చినా మానేయాల్సింది మనమే అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ CEOకి ఎసరు తగిలింది అని కొందరంటే… లేదు మంటపెట్టాడు అని మరికొందరు అంటున్నారు.ఇక మీరు కూడా ఇక్కడ వున్న మీమ్స్ చూసి మీమీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.







