ప్రస్తుతం పెళ్లికి ముందు వధూవరులు కలుసుకుని, తమ మధురానుభూతులను జీవితాంతం ఉంచుకునేలా ఫొటోషూట్లు తీయించుకున్నారు.కొందరు బురదలో దొర్లుతూ వెరైటీగా ఫొటోలు తీయించుకుంటున్నారు.
ఇంకొందరు బీచ్‌లో తిరుగుతూ, మరికొందరు పై నుంచి దూకుతూ ఇలా రకరకాలుగా ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్లు తీయించుకుంటున్నారు.అయితే వాటిని తలదన్నేలా ప్రస్తుతం నెట్టింట ఓ వీడియో బాగా ఆకట్టుకుంటోంది.
సినిమా స్టంట్లను తలపించేలా ఓ జంట ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ తీయించుకుంది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
వెడ్డింగ్ బిజినెస్‌లో ఈ రోజుల్లో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్లు జోరుగా సాగుతున్నాయి.ట్రెండ్ అత్యున్నత స్థాయికి చేరుకుంది.మెట్రోపాలిటన్ సిటీలలో ఎక్కువ మంది జంటలు ఈ తరహా ట్రెండ్‌కు బాగా అలవాటు పడుతున్నారు.త్వరలో పెళ్లి చేసుకోబోయే వారు తమ పెళ్లికి సంబంధించిన ప్రతి అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లే, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లకు కూడా తగిన శ్రద్ధ ఉండేలా చూసుకుంటారు.
నిజానికి, నేటి జంటలు తమ వివాహ ఆచారాల కంటే ప్రీ-వెడ్డింగ్ షూట్లపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు.
తాజాగా వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ జంట బైక్ పై ఎక్కి కూర్చుంది.వారి బైక్ క్రేన్ కు వేలాడుతూ గాలిలో ఉంది.కాసేపటికి వారి బైక్ సినిమా స్టంట్ తరహాలో ఓ కారుపై నుంచి ఎగురుతూ వెళ్లి ల్యాండ్ అయింది.
ఇలాంటివన్నీ సినిమాలలోనే మనం చూస్తుంటాం.అయితే సినిమాను తలపించేలా వారు ఇలా ఫొటో షూట్ తీయించుకున్నారు.
తమ అభిరుచిని ఇలా చాటుకున్నారు.ఈ వీడియోను నెట్టింట్లో పెట్టగానే నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.
పిచ్చి తలకెక్కితే ఇలాగే ఉంటుందని కొందరు, మీ ఆలోచన చాలా బాగుందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.