చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లకు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

ప్రతి స్టార్ హీరో సినీ కెరీర్ లో కొందరు హీరోయిన్లు లక్కీ హీరోయిన్లుగా గుర్తింపును సొంతం చేసుకుంటారు. చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో అలా లక్కీ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు కాజల్ అగర్వాల్ పేరు సమాధానంగా వినిపిస్తోంది.

 Shocking Facts About Star Heroine Kajal Agarwal Details Here Goes Viral In Socia-TeluguStop.com

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాజల్ కాంబినేషన్ లో మొదట తెరకెక్కిన సినిమా బృందావనం కాగా ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధించింది.

వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 2010 సంవత్సరం అక్టోబర్ లో విడుదలై ఫ్యామిలీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం.

ఆ తర్వాత శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన బాద్ షా సినిమాలో తారక్, కాజల్ కలిసి నటించారు.ఈ సినిమాలో తారక్ రామారావు పాత్రలో, కాజల్ బంతి జానకి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించడం గమనార్హం.

ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయం సాధించింది.

Telugu Charan, Kajal Agarwal, Magadheera, Mrperfect, Prabhas, Temper-Movie

ఆ తర్వాత టెంపర్ సినిమాలో తారక్, కాజల్ కలిసి నటించారు.పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కూడా అంచనాలకు మించి సక్సెస్ సాధించడం గమనార్హం. జనతా గ్యారేజ్ సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్ చేయగా ఆ సినిమా కూడా సక్సెస్ సాధించింది.

చరణ్ విషయానికి వస్తే మగధీర సినిమాలో చరణ్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గమనార్హం.

Telugu Charan, Kajal Agarwal, Magadheera, Mrperfect, Prabhas, Temper-Movie

ఆ తర్వాత నాయక్ సినిమాలో చరణ్ కాజల్ కలిసి నటించారు. వి.వి.వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.గోవిందుడు అందరి వాడేలే సినిమాలో కూడా కాజల్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించింది.

చరణ్, తారక్ లతో కాజల్ నటించిన అన్ని సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం.ప్రభాస్ కు జోడీగా కాజల్ నటించిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు కూడా సక్సెస్ సాధించాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube