రిషబ్ శెట్టి హీరో గా నటించిన దర్శకత్వం వహించిన కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మీద రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది.దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతోపాటు కలెక్షన్ల మోత మోగిస్తోంది.
హోం బలే సంస్థ తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతోంది.కేవలం కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు,తమిళం,హిందీ ఇలా అన్ని భాషల్లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబడుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
అంతేకాకుండా ఈ సినిమా విడుదల అయ్యి రెండు వారాలు పూర్తి కావస్తున్నా కూడా ఈ సినిమా మేనియా ఇంకా తగ్గలేదు.కాగా ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టిన కాంతార సినిమా తాజాగా మరొక రికార్డును కూడా నెలకొల్పింది.
ఆల్ టైం అత్యధిక వసూళ్లను సాధించిన కన్నడ సినిమాల జాబితాలో రెండవ స్థానానికి చేరుకొని రికార్డును సృష్టించింది కాంతార సినిమా.అంతేకాకుండా కన్నడ స్టార్ హీరో అయినా వేస్ట్ నటించిన కేజిఎఫ్ 1 సినిమాను వెనక్కి నెట్టేసింది.కాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో కేజీఎఫ్-2 రూ.1207 కోట్ల భారీ వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది.కాగా ఈ ఏడాది 2022 లో అన్ని భాషల్లో కలిపి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమా ల జాబితాలో కాంతార సినిమా కూడా చేరింది.ఆ జాబితాలో కేజీఎఫ్- 2, ఆర్ఆర్ఆర్, పొన్నియిన్ సెల్వన్-పార్ట్1 , విక్రమ్, బ్రహ్మాస్త్ర -పార్ట్ 1, భూల్ భూలయ్యా -2 చిత్రాల తర్వాత ఏడో స్థానంలో కాంతార నిలిచింది.
మరి కాంతార సినిమా ఇంకా ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి మరి.







