గత ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగాయో మనందరికీ తెలిసిందే.మా అధ్యక్షుడిగా గెలవడం కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ పడిన విషయం తెలిసిందే.
మా ఎన్నికలు గత ఏడాది రాష్ట్ర ఎన్నికలను తలపించాయి.మా అధ్యక్షుడిగా మంచి విష్ణు విజయం సాధించిన విషయం తెలిసిందే.
మా అధ్యక్షుడిగా గెలిచిన సమయంలో మంచు విష్ణు కొన్ని పనులు చేస్తాను అంటూ ప్రమాణాలు కూడా చేశాడు.ఇది ఇలా ఉంటే ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్ లో మా అధ్యక్షుడు అయినా మంచు విష్ణు మా ఎన్నికల సమయంలో తాను చెప్పిన పనుల్లో 95 శాతం పనులు పూర్తి చేశానని తెలిపారు.
అంతేకాకుండా త్వరలోనే మా బిల్డింగ్ కూడా కడతాను అని మంచు విష్ణు తెలిపాడు.కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రకాష్ రజ్ మంచు విష్ణు వ్యాఖ్యలపై స్పందించాడు.
ఇంటర్వ్యూలో భాగంగా ప్రకాష్ రాజు మాట్లాడుతూ మా అసోసియేషన్ పనితీరుపై స్పందించారు.అయితే ఇండైరెక్టుగా చురకలు అంటించాడు ప్రకాష్ రాజ్.
ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.గెలిచారు.
ఏం పని చేశారు అన్నది అందరికీ తెలుసు.కానీ పని చేశారా చేయలేదా అనేది సభ్యులకు మాత్రమే తెలుసు.
వాళ్లు నిర్ణయించని.ఇంకా ఒక సంవత్సరం సమయం ఉంది.
ప్రకటించడం వల్ల పనులు చేసినట్లు కాదు కదా.

ప్రకటిస్తున్నారు ఓ మనిషి ఓ మాట చెబుతున్నాడు.అది నిజమా!లేదా.అన్నది నువ్వు తీసుకోవాలి చేస్తున్నారా లేదు.
కదా అది వాళ్ళ బాధ్యత అని తెలిపాడు ప్రకాష్ రాజ్.ఇప్పుడు ఏం పని చేశారో చూద్దాం అంటూ మా అసోసియేషన్ పనితీరుపై స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు ప్రకాష్ రాజ్.
మా ఎన్నికల ముగిసాయి మరో ఏడాదిలో.మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి.
అయితే రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మంచు విష్ణు ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.







