కరెన్సీ నోట్లపై శాస్త్రవేత్తల బొమ్మలు ముద్రించాలి!

మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్ మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై వినాయకుని బొమ్మలు , లక్ష్మిదేవి బొమ్మలు , రాముడి బొమ్మలు ముద్రించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విఙ్ఞప్తి చేసాడు.అది ఆయన కున్న అజ్ఞానాన్ని తెలియచేస్తుంది .

 Figures Of Scientists Should Be Printed On Currency Notes , Dolls, Lakshmi Dolls-TeluguStop.com

ఒక వైపు ప్రపంచమానవుడు ఇతరగ్రహాలలో కాపురం పెట్టేందుకు ఉరకలేస్తుంటే , ఇక్కడమనం ఊహాజనితమైన , కల్పితమైన పురాణాలలొ పేర్కొన్న వారి బొమ్మలను వెయ్యమని , ఒకరకమయిన ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం సరికాదు .కరెన్సీ నోట్లపైనే కాదు ప్రతిపేదవాడి గుడిసెల్లో ముఖ్యమంత్రి కెజ్రి వాల్ చెప్పిన లక్శ్మి , వినాయకుని బొమ్మలు , రాముని బొమ్మలు ఉన్నాయి .మరి వారి జీవితంలొ ఏరకమైన మార్పు వచ్చిందో చెప్పాలి.సమాజాన్ని మార్చిన శాస్త్రవేత్తల బొమ్మలు పెట్టుకుంటే వారి స్ఫూర్తి గుర్తుకొచ్చి , వారి అలోచనలకు మార్గదర్శకులుగా తయారు కావచ్చు.

Telugu Delhi Kejriwal, Dolls, Lakshmi Dolls, Rama Dolls-Latest News - Telugu

అసలు ప్రభుత్వం ముద్రించే కాగితం తయారు చేసిన వారుఎవరో , ముద్రణా యంత్రాన్ని కనిపెట్టింది ఎవరో ఈప్రధానికి, ఈ కేజ్రి వాలాకు తెలుసా ! మూఢ నమ్మకాలను నిర్ములిస్తేనే సమాజం బాగుపడుతుందని ఎలుగెత్తి చాటిన చార్వాకుల బొమ్మలు ముద్రించినా ప్రజలలో చైతన్యం వచ్చేందుకు అవకాశముంది.పురోహితవర్గాన్ని , యజ్ఞయాగాలను , ముహూర్తాలను ఉతికి ఆరేసిన “వేమన “ , ప్రపంచమంతా తిరిగి బాబాల మహిమలను తనముందు ప్రదర్శించమని సవాల్ చేసిన డాక్టరు .కోవూర్ లాంటివారి బొమ్మలు , పెరియార్ రామస్వామి లాంటివారి బొమ్మలు , త్రిపురనేని రామస్వామి లాంటి వారి బొమ్మలు , పూలె , అంబెడ్కర్ లాంటి వారి బొమ్మలు , పెట్టాలి.ప్రపంచములో మొదటిసారిగా ముద్రణా యంత్రాన్ని కనిపెట్టిన గుటన్ బర్గ్ బొమ్మని కరెన్సీ నోట్లపై ముంద్రించాలి.

అలాగె కొన్ని నోట్లపై ఇతర శాస్త్రవేత్తలపేర్లు , సామాజిక శాస్త్రవేత్తల పేర్లూ ముంద్రించాలి.అంతేకాని లక్శ్మి , వినాయకుడు , రాముడు , కృష్ణుడు లాంటి ఊహాజనితమైన , కట్టుకధలలో ఉన్నవారి పేర్లను పెట్టవద్దు.

సమాజం ఇప్పటికే ఎంతో వెనక్కి పోయింది .ఇంకా వెనక్కి తీసుక పోవద్దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube