అందర్నీ ఆకట్టుకునేలా కథలు, కవితలు రాసే టాలెంట్ కొందరికి మాత్రమే ఉంటుంది.అయితే ఈ టాలెంట్‌ను ఉపయోగించి డబ్బులు సంపాదించడం చాలా సులభం.
కాకపోతే చాలామందికి తమ రచనలతో డబ్బు సంపాదించడం ఎలాగో తెలియదు.మరి ఈ ఆర్టికల్‌లో కథలు, కవితలు రాసి డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం.
కథలు, కవితలు రాసేవారు లిటరరీ మేగజైన్స్, కంటెంట్ క్రియేషన్ వెబ్‌సైట్స్, పబ్లిషింగ్ హౌస్ ఆశ్రయించడంతోపాటు ఓన్ బ్లాగ్ కూడా క్రియేట్ చేయవచ్చు.ఒకవేళ ఇవన్నీ చేయడం కష్టం అనుకుంటే రైటర్‌లు సింపుల్ గా అమెజాన్ కిండిల్ ద్వారా పబ్లిష్ చేసి ఆకర్షణీయమైన మొత్తంలో డబ్బులు పొందొచ్చు.
అమెజాన్ కిండిల్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది.దీంట్లో కథలు, కవితలు చదివే వారు చాలా ఎక్కువ మంది ఉంటారు.కాబట్టి ఇందులో మీరు మీ కథలను, కవితలను పబ్లిష్ చేసుకుంటే ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు.

అమెజాన్ కిండిల్‌లో నచ్చినన్ని కథలు పబ్లిష్ చేసుకోవచ్చు.ఇందుకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు.మీ కథలు బాగుంటే కస్టమర్లు చెల్లించే డబ్బులను అమెజాన్ మీకు అందిస్తుంది.
ఇంకా ఆన్‌లైన్‌లో షార్ట్ స్టోరీలు, లాంగ్ స్టోరీలు పబ్లిష్ చేసినందుకుగాను ప్రైజ్‌లు, డబ్బులు, రివార్డ్‌లు అందించే వెబ్‌సైట్స్ ఎన్నో ఉన్నాయి.గూగుల్ లో సెర్చ్ చేయడం ద్వారా మీరు వాటిని ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు.
బాగా టాలెంట్ ఉంది ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకునేవారు ఒక నవల లేదా బుక్ రాసి పేరు మోసిన పబ్లిషింగ్ హౌస్ వద్దకు వెళ్లొచ్చు.లేదంటే సినిమాలు, వెబ్‌సిరీస్ మేకింగ్ సంస్థలను ఆశ్రయించవచ్చు.







