తెలంగాణ మాగాణి మంచిర్యాల జిల్లాలోని సింగరేణిలో ఎన్నికల నగారా మోగనుంది.ఈ మేరకు సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికలు నిర్వహించాలని ఆగస్ట్ 4న ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.