పాముతో చెలగాటమాడిన పిల్లి.. చివరికి ఏది గెలిచిందంటే?

ఈ ప్రపంచంలో ముంగిసలను తప్ప ఏ జంతువునైనా చంపగల జీవులు పాములని చెప్పచ్చు.ఈ పాములలో కొన్ని మాత్రమే అత్యంత విషపూరితమైనవిగా ఉంటాయి.

 The Cat Who Fought With The Snake.. Which One Won In The End? ,viral Video, Snak-TeluguStop.com

వీటి జోలికి సింహాలు, పులులు కూడా వెళ్లవు.అయితే తాజాగా ఒక విషపూరితమైన పాముతో ఒక పిల్లి వీరోచితంగా పోరాడి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

పిల్లి పంచులకు తట్టుకోలేక ఆ పాము చివరికి తోక ముడుచుకొని బతుకు జీవుడా అంటూ పారిపోయింది.ఈ రెండు జీవుల మధ్య జరిగిన భీకరమైన పోరాటానికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ వీడియోలో ఓ పెద్ద పాము ఓ ఇంటి బయట నుంచి జర జరా పాక్కుంటూ బయటకు వెళ్తున్నట్లు కనిపించింది. రెండు పిల్లులు ఆ పాము దగ్గరికి వచ్చాయి.

వాటిలో ఒక పిల్లి పాము వెళ్తుంటే దాని తోక మీద గట్టిగా కొట్టింది.దాంతో పాము ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

అనంతరం అది పడగవిప్పి యుద్ధానికి సై అన్నది.రెప్పపాటు సమయంలోనే అది పిల్లిని కాటేయడానికి ప్రయత్నించింది.

పాము బుసలు కొడుతూ దాడి చేయడానికి ముందుకు వస్తున్నా పిల్లి భయపడకుండా ఎదురుదాడికి దిగింది. పిల్లి గోళ్లతో గట్టిగా పంచులు విసురుతుంటే పాము తట్టుకోలేక తనని తాను రక్షించుకునేందుకు ముడుచుకుంది.

పాము ఇలా చేసినా పిల్లి దానిని వదిలిపెట్టకుండా దాడి చేసింది.దాంతో బాగా గాయాలు పాలైన ఆ పాము తన ప్రాణాలను రక్షించుకునేందుకు అక్కడి నుంచి పారిపోయింది.ఈ వీడియోను beautifullanimalsdotcom అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేసింది.ఈ వీడియోను వేలలో లైక్స్, లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube