వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ నేతృత్వంలో శుక్రవారం శాస్త్రీయ పద్ధతిలో దహనం చేశారు.ఖమ్మం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన, సీజ్ చేసిన 2500 కిలోల ఎండు గంజాయిని పోలీస్ ఫైరింగ్ రెంజ్ మంచుకొండ అటవీ ప్రాంతంలో నిర్వీర్యం చేశారు.
మొత్తం 28 కేసుల్లో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జరిపిన నేరస్థులను అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
జిల్లాలోని ఠాణాల్లో నిల్వ ఉన్న సరకును కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల గెజిట్ నోటిఫికేషన్ల ఆధారంగా డీజీపీ గారి సూచనల మేరకు నిర్వీర్యం చేశామన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ శభరిష్ ఏ
.






