అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.దాదాపుగా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసిన పుష్ప సినిమా కి ప్రస్తుతం సీక్వెల్ రూపొందించే పని లో దర్శకుడు సుకుమార్ ఉన్నాడు.
ఈ సంవత్సరం ప్రారంభంలోనే పుష్ప సినిమా సీక్వెల్ షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అవ్వాల్సి ఉంది.కానీ ఇప్పటి వరకు సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు, అందుకు కారణం పుష్ప మొదటి భాగం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే.
అందుకే పుష్ప 2 కోసం భారీ అంచనాలు ఉన్నాయి.ఆ కారణం గానే స్క్రిప్ట్ విషయం లో దర్శకుడు సుకుమార్ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

మొన్నటి వరకు అక్టోబర్ నెల లో ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొదలు అవ్వలేదు.నవంబర్ నుండి సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి అంటున్నారు.నవంబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ కార్యక్రమం లో ప్రారంభిస్తే వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని సుకుమార్ సన్నిహితులు చెబుతున్నారు.
పుష్ప 1 లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా సమంత ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమా లో కూడా రష్మిక మందన హీరోయిన్ గా కనిపించబోతుంది.
అయితే ఐటెం సాంగ్ విషయం లో మరో హీరోయిన్ కనిపించే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.కాజల్ తో పాటు మరి కొందరు హీరోయిన్స్ ని కూడా పుష్ప 2 ఐటం సాంగ్ కోసం సంప్రదించారని తెలుస్తోంది.







