ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దేశంలోని ప్రతిభావంతులను ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటారు.తాజాగా ఆయన ఓ బాలిక అద్భుత ప్రతిభ చూసి ఎంతగానో ముచ్చట పడ్డారు.
ఈమధ్య ఈ బాలిక తన టాలెంట్ తో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించింది.ఈ చిన్నారి ఒకేసారి ఒంటి చేత్తో 15 ఫొటోలు గీయగలదు.
మొన్న ఈ మధ్య అలానే వంటి చేత్తో ఏకంగా 15 చిత్రపటాలు గీసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తన పేరున లిఖించుకుంది.ఈ బాలిక ఫీట్‌కు మంత్రముగ్ధులైన మహీంద్రా ట్విట్టర్ వేదికగా ఆ అమ్మాయి ప్రతిభను చూపించే ఒక వీడియో షేర్ చేశారు.అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
“ఇది అసలు ఎలా సాధ్యం?? ఆమె ప్రతిభావంతులైన కళాకారిణి అని ఒప్పుకోక తప్పదు.కానీ ఒకేసారి 15 పోర్ట్రెయిట్‌లను చిత్రించడం కళ కంటే మించిన టాలెంట్.ఇది ఒక అద్భుతం! ఎవరైనా ఈ ఘనతను ఆమె నిజంగానే సాధించిందా లేదా అనేది నాకు తెలియజేస్తారా? ఇది నిజమే అయితే, ఆమెను తప్పనిసరిగా ప్రోత్సహించాలి.స్కాలర్‌షిప్, ఇతర రకాల మద్దతును అందించడానికి నేను కచ్చితంగా ముందుకు వస్తాను.” అని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
వైరల్ వీడియోలో ఓ బాలిక తన ఆర్ట్ పక్కన నిలుచుని ఉండటం కనిపించింది.ఆ తర్వాత ఈ బాలిక ఒక చెక్క లాంటిది పట్టుకొని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుల పెయింటింగ్స్ గీసింది.చూసేందుకు ఇది చాలా అద్భుతంగా కనిపించింది.నెటిజన్లు కూడా ఇది ఎలా సాధ్యమసలు? ఈ అమ్మాయి మామూలు టాలెంట్ కాదు అని కామెంట్ చేస్తున్నారు.మిగతా నెటిజన్లను ఔరా అంటున్నారు.ఈ వీడియోకి 24 లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.
దీనిపై మీరు కూడా లుక్కేయండి.