గుండెల్లో మంట లేదా హార్ట్ బర్న్.చాలా కామన్ గా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.
గుండెల్లో మంట అనేది గుండెకు సంబంధించిన సమస్య అనుకుంటే పొరపాటే.ఎందుకంటే ఇది ఒక అన్నవాహిక రుగ్మత.
పొట్టలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం యొక్క రివర్స్ ఫ్లో వల్ల ఛాతి ప్రాంతంలో తీవ్రమైన మంట కలుగుతుంది.ఈ మంట కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.
ఈ క్రమంలోనే గుండెల్లో మంటను నివారించుకునేందుకు ఏవేవో మందులు తీసుకుంటారు.కానీ సహజంగా కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.ముఖ్యంగా గుండెల్లో మంట పెడుతున్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఫుడ్స్ ను తీసుకుంటే క్షణాల్లో ఉపశమనం లభిస్తుంది.మరి ఇంతకీ ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండెల్లో తీవ్రమైన మంట పెడుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్కను తీసుకుని తినాలి.ఇలా చేస్తే బెల్లంలో ఉండే పలు సుగుణాల మంటను ఇట్టే మాయం చేస్తాయి.గుండెల్లో మంటను నివారించడంలో చల్లటి పాలు అద్భుతంగా సహాయపడతాయి.పాలను కాచి బాగా చల్లారిన తర్వాత తీసుకోవాలి.
ఇలా తీసుకుంటే గుండెల్లో మంట నుంచి క్షణాల్లో రిలీఫ్ ను పొందవచ్చు.

అలాగే గుండెల్లో బాగా మంట పెడుతున్నప్పుడు ఒక గ్లాస్ వాటర్ ను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తీసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.అరటిపండు గుండెల్లో మంటను దూరం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
ఆ సమయంలో బాగా పండిన ఒక అరటి పండును తీసుకుంటే గుండెల్లో మంట ఇట్టే దూరమవుతుంది.ఇక పుచ్చకాయ రసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, బాదం పాలు, సోంపు గింజలు, తులసి ఆకులు వంటివి తీసుకున్న సరే గుండెల్లో మంట నుంచి తక్షణ ఉపశమనాన్ని పొందవచ్చు.







