తెలుగు బుల్లి తెరపై యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె అనంతరం వెండితెర అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.
ఇలా ఒకవైపు కెరియర్ లో ఎంతో బిజీగా ఉండే అనసూయ తరచు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ముఖ్యంగా ఈమె తన వస్త్రధారణ గురించి పెద్ద ఎత్తున నేటిజన్ ల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు.
ఇలా ఎంతోమంది అనసూయ వస్త్రధారణ పై కామెంట్లు చేస్తూ తనని ట్రోల్ చేశారు.అయితే ఇలా తన వస్త్రధారణ గురించి నెగిటివ్ కామెంట్లు చేసిన వారి పట్ల అనసూయ స్పందిస్తూ తనదైన స్టైల్ లో సమాధానం చెబుతూ వచ్చారు.
తనకు నచ్చిన విధంగానే తన వస్త్రధారణ ఉంటుంది అంటూ ట్రోలర్స్ కు గట్టి సమాధానం చెప్పారు.అయితే అనసూయ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులను రెచ్చగొడుతూ ఉండేలా పోస్టులు చేయడం దాంతో విమర్శలు ఎదుర్కోవడం జరుగుతుంది ఈ క్రమంలోనే తాజాగా ఈమె మరొక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

అనసూయ ఒక హాలీవుడ్ సాంగ్ కు డాన్స్ చేస్తూ.తెర వెనుక ఉండి ట్రోల్ చేసే నాస్టీ ట్రోలర్స్ కి నా యాటిట్యూడ్ సమాధానం.కుటుంబంలాగా ప్రేమించే ఎందరో అభిమానులు ఉన్నారు, అంటూ కామెంట్స్ వీడియోలో పోస్ట్ చేశారు.ఈ వీడియోలో అనసూయ మరోసారి పొట్టి దుస్తులు ధరించి డాన్స్ చేయడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే ఎంతోమంది నెటిజన్లు మరోసారి ఈమె చేసిన ఈ పోస్ట్ పట్ల తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ప్రస్తుతం అనసూయ అమెరికాలో ఉన్న విషయం మనకు తెలిసిందే.







