సినిమా చూసి నాన్న అర్ధరాత్రి ఫోన్ చేశారు.. రకుల్ కామెంట్స్ వైరల్?

నటి రకుల్ ప్రీతిసింగ్ భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ సిద్ధార్థ మల్హోత్రా, కలిసి నటించిన చిత్రం థ్యాంక్‌ గాడ్.

 Dad Called Me After Watching Thank God Movie Rakul Comments Viral Details, Rakul-TeluguStop.com

ఈ సినిమా ఇటీవలే విడుదల ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇక ఈ సినిమాలో నటి రకుల్ ప్రీతిసింగ్ పాత్రకు పెద్ద ఎత్తున ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమా చూసిన రకుల్ తల్లిదండ్రులు సైతం ఆమెకు ఫోన్ చేసి తనని అభినందించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.

థ్యాంక్‌ గాడ్ సినిమా చూసిన తన తల్లిదండ్రులు అర్ధరాత్రి సమయంలో తనకు ఫోన్ చేశారని రకుల్ వెల్లడించారు.

ఈ సందర్భంగా నాన్న ఫోన్ చేసే ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించానని తనపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఇప్పటివరకు తాను నటించిన సినిమాలలో ఉత్తమ సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని నాన్న సినిమాపై ప్రశంసలు కురిపించినట్టు రకుల్ తెలిపారు.ఈ సినిమా భారతీయ కుటుంబాలకు సంస్కృతికి చాలా దగ్గరగా ఉందని నాన్న ప్రశంసలు కురిపించారని రకుల్ తెలిపారు.

Telugu Ajay Devgan, Rakul, Rakul Dad, Rakul God, God-Movie

ఇక నాన్న నాతో మాట్లాడి సినిమాపై ప్రశంసలు కురిపించిన అనంతరం డైరెక్టర్ నెంబర్ తీసుకుని తనకి కూడా ఫోన్ చేసి ఇంత మంచి చిత్రాన్ని తీసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు అంటూ ఈ సందర్భంగా థ్యాంక్‌ గాడ్ సినిమా పట్ల తన తల్లిదండ్రులు స్పందించిన తీరును ఈమె తెలియజేశారు.ఇక ఈ సినిమాని ప్రేక్షకులతో కలిసి థియేటర్లో చూసినప్పుడు వారి నుంచి వచ్చిన స్పందన చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యానంటూ ఈ సందర్భంగా రకుల్ ప్రీతిసింగ్ తన సినిమా గురించి చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube