విద్యార్థుల కోసం మహేష్ బాబు సంచలన నిర్ణయం.. ఆయన గ్రేట్ అంటూ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.మహేష్ నటించిన సినిమాలు వరుసగా సక్సెస్ సాధించడంతో పాటు మహేష్ బాబు తర్వాత సినిమాలపై అంచనాలను మరింత పెంచుతుండటం గమనార్హం.

 Mahesh Babu Sensational Decision For Poor Students Details Here Goes Viral , Mah-TeluguStop.com

అయితే ఇప్పటికే తను సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం మహేష్ బాబు ఖర్చు చేస్తున్నారు.

తాజాగా మహేష్ బాబు బుర్రిపాలెంలోని విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ కు శ్రీకారం చుట్టారు.

మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా సూపర్ స్టార్ మహేష్ బాబు సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.తన ఫౌండేషన్ ద్వారా మహేష్ బాబు కష్టాల్లో ఉన్నవాళ్లకు అండగా నిలవడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తుకు ప్రయోజనం కలిగే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.

బుర్రిపాలెం ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్లను ఏర్పాటు చేయడం ద్వారా మహేష్ బాబు వార్తల్లో నిలవడం గమనార్హం.నమ్రత శిరోద్కర్ షేర్ చేసిన ఫోటోల ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.నమ్రత తన పోస్ట్ లో మహేష్ బాబు ఫౌండేషన్ మరో మంచి పనికి శ్రీకారం చుట్టిందని బుర్రిపాలెం విద్యార్థుల కోసం కంప్యూటర్లు ఏర్పాటు చేసిందని అన్నారు.ఇది చాలా గొప్ప రోజు అని ఆమె పేర్కొన్నారు.

నమ్రత శిరోద్కర్ చేసిన పోస్ట్ ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.మహేష్ బాబు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు మరింత దగ్గర కావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.మహేష్ త్రివిక్రమ్, రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తుండగా మహేష్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి త్వరలో క్లారిటీ రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube