హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ఘటనను మరువక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది.నేరేడ్ మెట్ జేజేనగర్ గ్రేస్ అనాథాశ్రమంలో బాలిక లైంగిక వేధింపులకు గురైనట్లు తెలుస్తోంది.
ఈనెల 19 నుంచి ఆశ్రమంలోని నలుగురు బాలికలు కనిపించకుండా పోయారు.ఆశ్రమం నుంచి బాలికలు పారిపోయినట్లు సమాచారం.
వీరిలో ఒకరు మేజర్ కాగా.ముగ్గురు మైనర్ బాలికలు.
ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టిన నేరేడ్ మెట్ పోలీసులు ఇద్దరిని సికింద్రాబాద్ లో మిగతా వారిని బంధువుల ఇళ్లలో గుర్తించారు.అనంతరం వారిని పోలీసులు సఖి సెంటర్ కు తరలించారు.
ఈ నేపథ్యంలోనే తనపై అకౌంటెంట్ మురళి లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ మైనర్ బాలిక తెలిపింది.బాలిక ఫిర్యాదుతో మురళితో పాటు ఆశ్రమ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.







