ఉగాండాలోని ఓ అంధుల పాఠశాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడినట్లు సమాచారం.
మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.సమాచారం అందుకున్న అధికారులు .ఘటనా స్థలాన్ని పరిశీలించారు.అనంతరం బాధితులను ఆస్పత్రికి తరలించారు.
కాగా మృతుల్లో చిన్నారులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.అయితే గతంలోనూ ఉగాండా రాజధాని అయిన కంపాలాకు సమీపంలో ఇటువంటి తరహాలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి.