సినిమా ఇండస్ట్రీకి క్రికెట్ రంగానికి ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉంది.సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది సెలబ్రిటీల క్రికెటర్లను పెళ్లిళ్లు చేసుకోగా, పలువురు క్రికెటర్లు సినిమాపై ఆసక్తితో సినిమాలలో కూడా నటిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇండియన్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సైతం సినిమాలపై మక్కువతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్నారు.ఈయన ఓ తమిళ సినిమా ద్వారా నిర్మాణరంగంలోకి అడుగుపెట్టబోతున్నారు.
ధోని నిర్మాణ సంస్థలో తన తొలి సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావించారట.
ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి ధోని ఇప్పటికే సంప్రదింపులు జరిపారని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నట్టు సమాచారం.ఈ క్రమంలోనే ధోని ఎంటర్టైన్మెంట్స్ స్థాపించిన ఈయన తన భార్య సాక్షితో కలిసి ఈ నిర్మాణ సంస్థ కార్యకలాపాలను కొనసాగించడానికి సిద్ధమయ్యారట.
ఈ క్రమంలోనే ధోని తన మొదటి సినిమాకి దర్శకుడిగా తమిళ డైరెక్టర్ రమేష్ తమిళమణి అనే దర్శకుడు ధోని మొదటి సినిమాకి డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు.

ధోని ఎంటర్టైన్మెంట్ నుంచి మొదటి సినిమా రావడంతో ఈ సినిమాని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.ఇక ఈ సినిమా తర్వాత సినిమాలను భారీ బడ్జెట్ తో నిర్మించాలని భావించారట.ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించునున్నట్లు సమాచారం.
ఇలా క్రికెటర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ధోని నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ నిర్మాతగా ఎలాంటి గుర్తింపు పొందుతారో తెలియాల్సి ఉంది.







