ఆడిషన్ కి వెళ్తే నల్లగా ఉన్నానని అవమానించారు: ప్రియదర్శి

ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టెర్రర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈయన పెళ్లిచూపులు సినిమా ద్వారా మరింత గుర్తింపు పొందారు.

 When I Went To The Audition I Was Insulted For Being Black Priyadarshi, Audition-TeluguStop.com

ఈ విధంగా పలు సినిమాలలో హాస్యనటుడిగా హీరో స్నేహితుడు పాత్రలలో సందడి చేసిన ప్రియదర్శి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా ఈయన బుల్లితెరపై ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రియదర్శి తన సినీ కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి రావడం తన ఇంట్లో వారికి ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో సినిమాటోగ్రాఫర్ అవుదామని కెమెరా వర్క్ నేర్చుకున్నాను.

ఇక 2014లో శ్రీకాంత్ హీరోగా నటించిన టెర్రర్ సినిమాకి ఆడిషన్స్ జరుగుతుంటే వెళ్లాను.

Telugu Alithosaradaga, Pelichoopulu, Priyadarshi-Movie

ఆడిషన్స్ లో నన్ను చూసి మొదట రిజెక్ట్ చేశారు.అనంతరం ఆ పాత్రకు తానే కరెక్ట్ గా సరిపోతానని భావించి పిలిచి మరి నాకు అవకాశం కల్పించారని ప్రియదర్శి వెల్లడించారు.అయితే తాను ఇండస్ట్రీలోకి రావాలనే ఉద్దేశంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఈయన వెల్లడించారు.

ఈ క్రమంలోనే అవకాశాల కోసం ఇండస్ట్రీ చుట్టూ ఆడిషన్స్ కి వెళ్లగా, ఆడిషన్స్ లో నేను నల్లగా ఉన్నానని, మొహం మొత్తం మొటిమలు ఉన్నాయని,హీరో కన్నా పొడువుగా ఉన్నానంటూ ఇలా పలు కారణాలు చెప్పి నన్ను రిజెక్ట్ చేసేవారు అంటూ సందర్భంగా ప్రియదర్శి వెల్లడించారు.ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రియదర్శి ఎన్నో విషయాలను వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube