హైదరాబాద్ మోతీ నగర్ లో పెను ప్రమాదం తప్పింది.ఓ అపార్ట్ మెంట్ పై మంటలు చెలరేగాయి.
దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్ కాలుస్తుండగా ఒక్కసారిగా మంటలు భారీగా చెలరేగాయి.ఈ మంటలు సెల్ టవర్ కూడా వ్యాపించడంతో అపార్ట్ మెంట్ వాసులు, స్థానిక వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.కాగా ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.







