బ్రిటన్ కు ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా రిషి సునాక్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.భారత సంతతి వ్యక్తి అయిన రిషి సునక్ బ్రిటన్ పీఠాన్ని అధిరోహించనున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మోదీ.2030 రోడ్ మ్యాప్ అమలు, ప్రపంచ సమస్యలపై కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.భారత్, బ్రిటన్ మధ్య చారిత్రక సంబంధాలు ఇకపై ఆధునిక తరం భాగస్వామ్యంలోకి అడుగుపెడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.అనంతరం బ్రిటన్ లోని భారతీయులకు మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.







